మంచు వార‌బ్బాయి రియ‌ల్ హీరో

Last Updated on by

గ‌త రెండు మూడేళ్ల‌గా మంచు మ‌నోజ్ సామాజిక ఎవేర్నెస్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. విప‌త్తుల స‌మ‌యంలోనూ చేత‌నైన స‌హాయం చేయ‌డంలోనూ ముందుంటున్నాడు. ఆ మ‌ధ్య మిర్యాల గూడ ఘ‌ట‌న‌పై త‌న‌దైన శైలిలో స్పందించాడు. ప్రేమ‌కు కులం ఏంటి? మంతం ఏంటి? అటుపై చోటుచేసుకున్న మ‌రెన్నో ఘ‌ట‌న‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందించి అవేర్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. తాజాగా ఓ బాలిక‌కు అండ‌గా నిల‌బ‌డి క‌లెక్టర్ ను చేస్తాన‌న‌మి ప్రామిస్ చేసి రియ‌ల్ హీరో అనిపించాడు. నేడు క‌లెక్షిన్ కింగ్ మోహ‌న్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌నోజ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. నాన్న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏదైనా మంచి ప‌నిచేయాల‌నుకున్నా.

అందుకే సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలిక‌ను ద‌త్త‌త తీసుకున్నంద‌కు గ‌ర్వ‌ప‌డుతున్నా. విద్యానికేత‌న్ పాఠ‌శాల‌లో ఆమెను జాయి చేసాను. పాప బాధ్య‌త‌ల‌న్నీ నావే. మంచి చ‌దువు, ఉన్న‌త ఉద్యోగం. త‌న క‌లెక్ట‌ర్ గ‌మ్యం చేరే వ‌ర‌క‌రూ ఆమె వెంట ఉటానని తెలిపాడు. ఈ ట్వీట్ చూసిన ఓ నేటి జ‌నుడు పాప‌ను ఐఏఎస్ అవ్వాల‌ని మ‌రీ ఒత్తిడి తీసుకురాకండ‌ని కోరాడు. వ‌య‌సు పెరిగే కొద్ది ఆమె ఆశ‌యాలు కూడా మారుతుంటాయి. అందుకు మ‌నోజ్ ఐఏఎస్ త‌న క‌ల బ్ర‌ద‌ర్. నేను ఎవ‌ర్ని డిసైడ్ చేయ‌డానికి! అశ్విత‌కు మంచి జీవితం ఇవ్వాలంతే అని ముగించాడు.

Also Read:Action King To Coming Up As Iddaru

User Comments