కులం ఉచ్చులో పడని స్టార్ ఫ్యామిలీ

టాలీవుడ్ లో ప్రస్తుతం స్పైడర్, జై లవ కుశ లాంటి స్టార్ హీరోల సినిమా హంగామా పీక్స్ లో ఉండటంతో మిగతా హీరోలను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీలో ఓ స్టార్ ఫ్యామిలీగా ఉన్న మంచు ఫ్యామిలీ తాజాగా కులం విషయంలో హైలైట్ గా నిలవడం స్వీట్ షాక్ అనే అనాలి.

ముందుగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు తన చిన్నప్పుడు వచ్చిన మోహన్ బాబు అల్లుడు గారు సినిమా షూటింగ్ టైమ్ లో తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

దీనిని తమ్ముడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రీట్వీట్ చేశాడు. ఇక అక్కడే అసలు కథ మొదలైంది.

సంబంధం లేకుండా నెట్ ఇంట్లో ఓ నెటిజన్ మోహన్ బాబు గారు చౌదరి లేదా నాయుడా అంటూ డైరెక్ట్ గా కులం గురించి ప్రశ్నించాడు.

ఇలాంటి చెత్త విషయాలకు స్పందించాల్సిన పని లేకపోయినా..

మనోజ్ ‘ముస్లిం’ అంటూ రిప్లై ఇచ్చి మనం దేశం ప్రేమికులం అంటూ సింపుల్ గా క్లాస్ పీకడం హైలైట్ అయిందనే అనాలి.

ఇదే సమయంలో మరో నెటిజన్.. కులం గురించి అడిగితే మతం గురించి చెప్పారేంటి భయ్యా? అంటూ ప్రశ్నించడం గమనార్హం.

ఇక దీనికి కూడా మనోజ్ రిప్లై ఇస్తూ.. కులానికి మతానికి పెద్ద తేడా లేదు బ్రదర్ అంటూ, మనం ఇండియన్స్, అంతకు మించి మనుషులం అని, మన కులం ప్రేమికులం అని తన స్టైల్లో ఎడ్యుకేట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయినా సరే కొంతమంది కులం పిచ్చిలో పడి.. మన స్టార్స్ ను కూడా కులం ఉచ్చులో పడేయడానికి ప్రయత్నించినా, మంచు మనోజ్ మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో సదరు నెటిజన్లు సైలెంట్ అయిపోయారు.

ఏదిఏమైనా, జనాలు ఇంకా కులం భజన చేయడం బాధగా ఉన్నా.. సెలబ్రిటీ హోదాలో ఉన్న ఓ స్టార్ ఇలా ఎడ్యుకేట్ చేయడం మంచి విషయమే అనాలి.

అయినా సదరు ప్రబుద్ధులు మారరు కదా.

కానీ, మనోజ్ తరహాలో పెద్ద హీరోలు సైతం ఇలాంటి విషయాల్లో ఈ విధమైన వాదనను బలంగా వినిపిస్తే మాత్రం కొంతైనా మేలు జరుగుతుందని చెప్పొచ్చు.

అయితే, అది జరిగే పని కాదని మాత్రం చెప్పకండే.

Follow US