ఇదేం ట్విస్టు: జ‌న‌సేనకే మ‌నోజ్ ఓటు

Last Updated on by

ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీని ఉద్దేశించి మంచు మ‌నోజ్ పాజిటివ్ గా ట్వీట్లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌ద్ద‌తు విష‌యంలో పూర్తిగా జ‌న‌సేన‌కే ఉంటుందా? లేక‌ వైసీపీకి ఉంటుందా? అన్న సందేహాలు ప్రేక్ష‌కాభిమానుల్లో మొదిలాయి. మోహ‌న్ బాబు టీడీపీకి వ్య‌తిరేకి గా జ‌న‌సేనాని కి మ‌ధ్దుతుగా నిలిచారు. అయితే వైకాపా అధ్య‌క్ష‌డు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మోహ‌న్ బాబుకి బంధుత్వం ఉంది. జ‌గ‌న్ ని ఆకాశానికి ఎత్తేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు, విష్ణు వైసీపీ వైపు ఉండే అవ‌కాశాలున్నట్లు ప్ర‌సారం సాగింది? మ‌నోజ్ తొలి నుంచి జ‌న‌సేన వైపు పాజిటివ్ గా వెళ్ల‌డం వెనుక ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది.

అయితే ఇదే విష‌యాల‌ను విశ్లేషిస్తు కొంత మంది అభిమానులు మీ ఓటు ఎవ‌రికని? సూటిగా అడిగేసారు. దీంతో మ‌నోజ్ కూడా అంతే సూటిగా స‌మాధానం ఇచ్చాడు. `నా ఓటు జ‌న‌సేన‌కే`అంటూ కుండ‌బ‌ద్దలు కొట్టేసాడు. దీంతో మెగా అభిమానుల్లో నెల‌కొన్న సందేహాల‌కు ఓ స‌మాధానం దొరికిన‌ట్లు అయింది. రెండు రోజుల క్రితం మోహ‌న్ బాబు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌నితీరును దుయ్యబెట్టారు. ఈ వేడిలోనే మ‌నోజ్ జ‌న‌సేనకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం అంతాటా హాట్ టాపిక్ అవుతోంది.

User Comments