హీరోయిన్ పై చీప్ గా నోరు జారిన మంచు విష్ణు

Manchu Vishnu Double Meaning Comments Pragya Jaiswal

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకుగా తెరంగేట్రం చేసిన మంచు విష్ణు ఇప్పుడు తన డైలాగ్స్ తో చిన్నపాటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో మంచు విష్ణు షేర్ చేసిన వీడియో ఒకటి చిన్నపాటి చర్చకే దారితీసింది. ఆ స్టోరీలోకి వెళితే, మంచు విష్ణు హీరోగా, కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా ప్రస్తుతం ‘ఆచార్య అమెరికా యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసే ఉంటుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఛైర్ లో కూర్చుని మెడకు ఐస్ పెట్టుకుని పెయిన్ పోగొట్టుకుంటున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను మంచు విష్ణు వీడియో తీస్తూ ఇంగ్లీష్ లో కొన్ని ప్రశ్నలు అడిగాడు. మొదట నీ మెడకు ఏమైందని మంచు విష్ణు అడిగితే.. కార్లో పడుకున్నప్పుడు తన మెడ పట్టేసిందని ప్రగ్యా చెప్పింది. దానికి కౌంటర్ గా ‘వైల్ స్లీపింగ్ విత్.. ‘ అంటూ విష్ణు కొంచెం కొంటెగా అడిగితే.. ప్రగ్యా దానికి చిరాగ్గా ‘ఇన్ ద కార్’ అంటూ ఆన్సర్ కొట్టినట్లు చెప్పింది. అయితే, ఇది ఇక్కడితో ఆపేస్తే బాగానే ఉండేదేమో.
కానీ, తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ప్రగ్యా ఆన్సర్ ను తాను నమ్మగలనో లేదో అంటూ మంచు విష్ణు ట్వీట్ చేయడం చాలామందికి చిరాగ్గా అనిపిస్తోంది. ఇదంతా జస్ట్ ఫన్ కోసమే చేసిందని మంచు విష్ణు అనుకుంటున్నాడేమో తెలియదు గాని.. జనాలు మాత్రం వేరే అభిప్రాయాలు తీస్తూ మంచువారబ్బాయి అతి చేశాడనే ఫీలింగ్ కలుగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఇలా తాను చీప్ గా మాట్లాడటం పర్సనల్ గా బాగానే ఉన్నా.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ లెక్కన చూస్తుంటే, మంచు విష్ణు కి మంచు మోహన్ బాబు గారు మరోసారి క్లాస్ పీకడం అవసరమేమో అనిపిస్తోంది. ఏదిఏమైనా, ప్రస్తుతం ఈ మంచు హీరో అమెరికా యాత్రలో ఉన్నాడు కదా.. అందుకేనేమో ఆ రేంజ్ లో డిస్కషన్స్ నడిపిస్తున్నాడు.