మండే ఎండ‌ల్లో ఓట‌ర్ హీట్

Last Updated on by

మంచు విష్ణు స‌క్సెస్ రుచి చూసి కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తోంది. ఏడాదికి ఒక్కో సినిమా చేస్తున్నా..విఫ‌లం త‌ప్ప స‌ఫ‌లాలు క‌నిపించ‌లేదు. స‌క్సెస్ ఇప్పుడు అత్యంత అనివార్యం. ఉన్న ఆశ‌ల‌న్నీ ఒకే ఒక్క సినిమా `ఓట‌ర్` పైనే. ఏడాది కాలం నుంచి ల్యాబ్ లోఉన్న సినిమా కు ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స్ చేసారు. షూటింగ్ పూర్తిచేసుకుని కొన్ని నెల‌లు గ‌డిచినా అనివార్య కార‌ణాల వ‌ల్ల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఆగిపోయింది. ఇప్పుడా ప‌నులు పున ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. నేడు మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శివుడు ఓట‌ర్ పై ఓ చూసి న‌ట్లున్నాడు. తాజాగా ఓట‌ర్ ని ఎప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. విష్ణు చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. దీంతో ఆశ‌ల‌న్నీ దీనిపైనే పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో హిట్ కొట్టిన త‌ర్వాతే మ‌రో ఛాన్స్! అనే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అవ‌స‌ర‌మైన చోట మ‌ళ్లీ రీషూట్ కు వెళ్లి మ‌రీ రెడీ అయ్యాడు ఓట‌ర్. మ‌రి ఓట‌ర్ ద‌మ్మెంతో తెలియాలంటే ఏప్రిల్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఇందులో విష్ణుకు జోడీగా సుర‌భి న‌టిస్తోంది. ఆమె కెరీన్ కూడా ఎక్క‌డ వేసిన గోంగ‌డి అక్క‌డే ఉంది. నాలుగైదు సినిమాలు చేసినా చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టీ లేదు. ఈ సినిమాతోనైనా ఫేమ్ లోకి వ‌స్తుందేమో చూద్దాం. ఈ చిత్రాన్ని జి.ఎస్ కార్తీక్ తెర‌కెక్కిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. రామ్ లీల బ్యాన‌ర్ పై జాన్ సుధీర్ నిర్మిస్తున్నారు.

User Comments