ఝాన్సీ లక్ష్మీభాయ్ రైజింగ్

కంగ‌న టైటిల్ పాత్ర పోషిస్తున్న‌ `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆప్ ఝాన్సీ` చిత్రం ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. రిప‌బ్లిక్ డే గిఫ్ట్ ని తన అభిమానుల కోసం సిద్ధం చేస్తోంది కంగ‌న‌. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై ఉత్కంఠ పెంచాయి. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ ఆద్యంతం ఝాన్సీ రాణి వీర‌త్వం క‌ట్టిప‌డేసింది. ఈ ప్ర‌చారం మ‌రింత జోరుగా చేస్తోంది కంగ‌న. తాజాగా భ‌ర‌త్ పేరుతో వీడియోని రిలీజైంది. ఇందులో ఝాన్సీ రాణి బాల్యం స‌హా క‌త్తి చేత‌ప‌టి శ‌త్రువుపై లంఘించే వీర‌నారిగా మారే వ‌ర‌కూ ఆద్యంతం ఆ గ్రాఫ్ ని చూపించారు. ఇది అంత‌కంత‌కు ఆస‌క్తి పెంచుతోంది.

గురుగ్రామ్ ఏరియాలో క్వీన్ కంగ‌న ప్ర‌స్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌ర‌త్ వీడియోని లాంచ్ చేశారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్ర‌సూన్ జోషి లిరిక్స్ అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా వెన‌కాడ‌ని ఓ ధీర‌వ‌నిత వీర‌త్వాన్ని తెర‌పై చూపిస్తున్నారు. అంకిత లోఖండే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. క్రిష్ – కంగ‌న సంయుక్తంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే క్రిష్ – కంగ‌న మ‌ధ్య వివాదాల గురించి తెలిసిందే.