మ‌ణిక‌ర్ణిక‌: పూర్ స్క్రీన్‌ప్లే రాశారా!

Last Updated on by

క్వీన్ కంగ‌న న‌టించిన `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` రిప‌బ్లిక్ డే కానుక‌గా ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమా స‌మీక్ష‌ల్ని లైవ్ లోకి తెచ్చారు. అస‌లు ఈ సినిమా ఏ స్థాయిలో ఉంది? అంటే కంగ‌న మార్క్ పెర్ఫామెన్స్ సినిమా ఆద్యంతం క‌ట్టి ప‌డేసింద‌న్న పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కొన్ని వార్ ఎపిసోడ్స్ స‌హా కామెడీ సీన్స్ గొప్ప‌గా పండాయిట‌.
ఇక‌పోతే విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా ర‌న్నింగ్ మిడిల్‌లో చిన్న‌పాటి క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంద‌ని వ్యాఖ్యానించారు ఓ స‌మీక్ష‌కుడు. ప్ర‌థ‌మార్థంలో కంగ‌న మ‌ర్ధానీ త‌ర‌హా న‌ట‌న క‌న‌బ‌రిచింద‌ని, ఫ‌స్టాఫ్ పూర్ అని వ్యాఖ్యానించారు. అయితే ఓవ‌రాల్ గా ఈ సినిమా కంగ‌న ఫ్యాన్స్ కు న‌చ్చుతుంద‌ని ప్ర‌శంసించారు. ఇక‌పోతే తెలుగు క్రిటిక్స్ కి, మ‌న‌ ఆడియెన్ కి ఈ వారియ‌ర్ క్వీన్ సినిమా ఎంత‌వ‌ర‌కూ న‌చ్చుతుంది? అన్న‌ది తేలాల్సి ఉంది. బాలీవుడ్ క్రిటిక్స్‌లో ఒక‌రు విజ‌యేంద్రుని స్క్రీన్ ప్లేని త‌ప్పు ప‌ట్టారు. అయితే ఆ అభిప్రాయం స‌రైన‌దేనా? కాదా? అన్న‌ది మ‌న క్రిటిక్స్ తేల్చాల్సి ఉంటుంది.

User Comments