ఐసీయు నుంచి సందేశం పంపాడు!

బాలీవుడ్ నాయిక కంగ‌న న‌టించిన చిత్రం మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ – కంగ‌న సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  క‌మ‌ల్ జైన్ నిర్మాత‌. జీ స్టూడియోస్ సంస్థ పెట్టుబ‌డులు స‌మ‌కూర్చింది. ట్రైల‌ర్ కి ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా రిలీజ్ కి వారం ముందు చిత్ర‌నిర్మాత ఊహించ‌ని రీతిలో గుండె పోటుకు గుర‌వ్వ‌డం, అటుపై ఐసీయులో వెంటిలేట‌ర్ పై ఉండ‌డం చిత్ర‌యూనిట్ లో తీవ్ర క‌ల‌త‌కు కార‌ణ‌మైంది.
నిర్మాత జైన్ ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పై ఉన్నారు. గుండె పోటు వ‌ల్ల అత‌డు ప‌క్ష‌వాతానికి గుర‌వ్వ‌డంతో ఈ సీరియ‌స్ స‌న్నివేశం నెల‌కొందిట‌. ఆయ‌న ఆస్ప‌త్రి నుంచే పంపించిన ఓ సందేశం చిత్ర‌యూనిట్ ని కంట‌త‌డికి గురి చేసింద‌ని చెబుతున్నారు. రెండేళ్ల పాటు ఎంత‌గానో శ్ర‌మించి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ స‌మ‌యంలో నేను ఆస్ప‌త్రి లో ఉండ‌డం ఇబ్బంది క‌ర‌మే. అయినా స‌క్సెస్ ని ఎంజాయ్ చేయండి. ప్ర‌మోష‌న్స్ తో మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని జ‌నాల‌కు బాగా చేరువ చేశారు. నేను త్వ‌ర‌గానే కోలుకుని వ‌స్తాను.. జైహింద్ .. అంటూ క‌మ‌ల్ జైన్ యూనిట్ కి సందేశం అందించారు. ఇది తీవ్రంగా క‌ల‌చివేసే స‌న్నివేశ‌మే. ఎన్నో ఒడిదుడుకుల మ‌ధ్య రిలీజ్  కి రెడీ అవుతున్న మ‌ణిక‌ర్ణిక చిత్రంపై ప్ర‌స్తుతం క‌ర్ణి సైన‌లు గుస్సా న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.