శిష్యుడి సినిమాకు మ‌ణిర‌త్నం నిర్మాత‌

నిజ జీవితంలో భార్య‌భ‌ర్త‌లైన శరత్‌కుమార్‌, రాధికలు ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ భార్య భర్తల్లాగా కనిపించబోతున్నారా? వాళ్ల నిజ జీవితాల‌కు ద‌గ్గ‌ర‌గా ఈ క‌థ ఉండ‌బోతుదా? అంటే అవున‌నే తెలుస్తోంది. రాధికా, శ‌ర‌త్ కుమార్ ల‌కు ముందు వేరు వేరుగాపె ళ్లిళ్లు అయిన సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల విడిపోయి చివ‌రికి రాధిక‌, శ‌ర‌త్ కుమారులు ఒక‌ట‌య్యారు. ఇప్పుడా క‌థ‌ను ఓల‌వ్ స్టోరీకి ఆపాదించి ధనశేఖరన్‌ డైరెక్షన్లో విక్రమ్ ప్రభు..ఐశ్వర్యా రాజేష్ జంట‌గా ‘వానం కొట్టట్టుం’ అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో శరత్ కుమార్ , రాధికలు కూడా త‌మ రియ‌ల్ పాత్ర‌లో నటించబోతున్నారు. సినిమాలోనూ ఇద్ద‌రు భార్యభర్తల్లానే న‌టిస్తున్నారుట‌.

సినిమా లో చ‌క్క‌ని స‌మందేశం కూడా ఉంటుందిట‌. సినిమా , అందులో పాత్ర‌లు చాలా వాస్త‌వికంగా ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. ధ‌న‌శేఖ‌రన్ కొన్నేళ్ల పాటు మ‌ణిర‌త్నం వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసాడు. వెరీ ట్యాలెంటెడ్ అట‌. అందుకే ఈచిత్రాన్ని మ‌ణిర‌త్నం స్వ‌యంగా నిర్మిస్తున్నారుట‌. మ‌ణిర‌త్నం బ్యాన‌ర్ మద్రాస్‌ టాకీస్‌ సంస్థ మ‌రో సంస్థ‌తో టైఅప్ అయి నిర్మిస్తోందిట‌. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ణిర‌త్నం కేవ‌లం త‌న సొంత క‌థ‌ల‌నే నిర్మించారు. బ‌య‌ట క‌థ‌ల‌ను నిర్మించింది లేదు. కానీ శిష్యుడి సినిమాకు తొలిసారి నిర్మాతగా మారారు.