స్కైలో `మ‌న్మ‌ధుడు 2` శాటిలైట్

కింగ్ నాగార్జున – ర‌కుల్ ప్రీత్ జంట‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కిస్తున్న `మ‌న్మ‌ధుడు 2` టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రొమాన్స్ డోస్ డ‌బుల్ రేంజులోనే చూపించ‌బోతున్నార‌ని టీజ‌ర్ చెబుతోంది. ఏజ్డ్ బ్యాచిల‌ర్ కామెడీతో పాటుగా ర‌కుల్ తో ఘాటైన స‌న్నివేశాలు ఉన్నాయి ఈ మూవీలో. ఆగ‌స్టు 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

టీజ‌ర్ త‌ర్వాత ఈ మూవీపైన అంచ‌నాలు పెరిగాయి. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల బిజినెస్ వ్య‌వ‌హారాలు స‌హా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ కి హైప్ పెరిగింద‌ని తెలుస్తోంది. తెలుగు- హిందీ శాటిలైట్ రైట్స్ .. డిజిట‌ల్ హ‌క్కులు క‌లుపుకుని ఏకంగా 24 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసింద‌న్న స‌మాచారం అందింది. ఈ స్థాయి బిజినెస్ సాగడం ఉత్కంఠ పెంచేదే. నాగార్జున గ‌త చిత్రం దేవ‌దాస్ ఆశించిన స్థాయి విజ‌యం అందుకోక‌పోయినా మ‌న్మ‌ధుడు 2 చిత్రానికి క్రేజు నెల‌కొన‌డం ఆస‌క్తిక‌ర‌మే. డిజిట‌ల్-శాటిలైట్ డీల్ అంత క్రేజీగా పూర్త‌యింద‌ని చెబుతున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ కాస్ట్ లీగానే ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతోంది.