మ‌నోజ్ ద‌ర్శ‌కుడు విష్ణు

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా మంచు కుటుంబ హీరోలు న‌టించిన సినిమాలు డిజాస్ట‌ర్ ఫ‌లితంతో నిరాశ‌కు గురి చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. మంచు విష్ణు, మంచు మ‌నోజ్ న‌టించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే అన్న‌ద‌మ్ములిద్ద‌రూ రేసులో వెన‌క‌బ‌డిపోయారు. మ‌రోవైపు ఇత‌ర హీరోలు కెరీర్ ప‌రంగా దూసుకెళుతుంటే మంచు క్యాంప్ మాత్రం ఎందుక‌నో వెన‌క‌బ‌డిపోవ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే తిరుప‌తి ప‌రిస‌రాల్లో విష్ణు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. శ్రీ‌విద్యానికేత‌న్ స‌హా రాష్ట్ర వ్యాప్తంగా టెక్నో స్కూల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ఇక మ‌నోజ్ ఇటీవ‌లి కాలంలో పూర్తి సైలెంట్‌గా ఉన్నాడు. అదంతా అటుంచితే .. త‌మ్ముడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు మంచు విష్ణు త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడిగా మారుతున్నార‌ని తెలుస్తోంది. మ‌నోజ్ హీరోగా విష్ణు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుందిట‌. అమెరికాలో మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని తెలిసింది. మొత్తానికి త‌మ్ముడి కోసం అన్న ప‌డుతున్న త‌ప‌న ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌కొచ్చింది. త‌మ్ముడంటే ప్రాణం పెట్టే అన్నఅత‌డి కెరీర్ బండిని ట్రాక్‌లోకి తెస్తాడా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది మంచు హీరోల‌కు రియ‌ల్ ఛాలంజింగ్ టైమ్‌. ఈ ఛాలెంజ్‌ని ఎలా టేక‌ప్ చేస్తారో వేచి చూడాల్సిందే.

User Comments