ఊర మాస్ ఆటో రాణి

Last Updated on by

ప్రేమ‌మ్, ఫిదా చిత్రాల‌తో టాలీవుడ్‌లో స‌త్తా చాటింది. ఆ రెండు సినిమాలు ఈ అమ్మ‌డికి తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ముఖ్య ంగా ఫిదా చిత్రంలో నైజాం యాక్సెంట్‌తో సాయి ప‌ల్ల‌వి తెలుగు యువ‌త‌ను మైమ‌రిపించింది. ఇటు నైజాం, అటు ఆంధ్రా రెండుచోట్లా త‌న‌కు వీరాభిమానులు ఏర్పడ్డారు. నాగ‌శౌర్య‌, శ‌ర్వానంద్‌ల‌తో ఈ అమ్మ‌డు గొడ‌వ ప‌డింద‌న్న ప్ర‌చారంతో మ‌రింత‌గా క్రేజు పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న ప‌డి ప‌డి లేచే మ‌న‌సు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదివ‌ర‌కూ రిలీజైన పోస్ట‌ర్లు క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకున్నాయి. హృద‌యానికి హ‌త్తుకునే చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రంలో సాయి ప‌ల్ల‌వి త‌న శ‌రీర‌భాష‌కు త‌గ్గ పాత్ర‌లో మైమ‌రిపించనుంది.

ఓవైపు ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తూనే, మ‌రోవైపు త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న `మారి 2` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిదాలో కాస్త నైజాం పోరిగా, ప‌ల్లెటూరి యాస మాట్లాడే పిల్ల‌గా మెప్పించింది. ఇప్పుడు అంత‌కంటే ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆటో రాణిగా ఖాకీ చొక్కా వేసుకుని .. జీన్స్ ఫ్యాంటు లో అదిరిపోయే స్టెప్పులేసే అమ్మాయిగా మారి 2లో క‌నిపించ‌బోతోంది. అస‌లే ధ‌నుష్‌కి ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా.. సాయి ప‌ల్ల‌వి అడిష‌న‌ల్ మాస్ అప్పీల్ మారి 2కి ప్ల‌స్ కానుంది. ఖాకీ తొడిగిన ఆటో రాణి రెబాన్ పెట్టుకుని ఫోజులిస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌త‌ర‌మా? సాయిప‌ల్ల‌వి అంద‌చందాలతో పాటు, ఆ ఎగ్రెస్సివ్ యాటిట్యూడ్ త‌న‌ని పెద్ద స్థాయిలో నిల‌బెడుతోంద‌న‌డానికి ఇదిగో మారి లుక్ ఎగ్జాంపుల్.దీపావ‌ళి కానుగా ఈ లుక్‌ని లాంచ్ చేసింది టీమ్‌.

User Comments