మారుతి విసిరిన బాంబ్‌

Last Updated on by

`భ‌లే భ‌లే మ‌గాడివోయ్` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ తీశాడు మారుతి. ఆ త‌ర్వాత అత‌డు సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఒక గౌర‌వం ఏర్ప‌డింది. ఈరోజుల్లో బూతు ఇమేజ్‌ని పూర్తిగా తుడిచేసింది ఆ చిత్రం. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య హీరోగా `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రాన్ని మారుతి తెర‌కెక్కిస్తున్నారు అన‌గానే వ‌ర్త్‌ఫుల్ సినిమాని ఇస్తార‌నే అంతా అంచ‌నా వేస్తున్నారు.

ఈ సినిమా ఆన్‌సెట్స్ ఉండ‌గానే మారుతి నిర్మించే ఓ సినిమా టైటిల్‌ని ప్ర‌కటించ‌డం విశేషం. `బ్రాండ్ బాబు` అనేది సినిమా టైటిల్‌. సుమంత్ శైలేంద్ర‌, ఈష రెబ్బ ఈ చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. ముర‌ళి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈటీవీ ప్ర‌భాక‌ర్ త‌న కెరీర్ రెండో చిత్రంగా ఈ క‌థ‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌. ఇంట్లో ప‌ని చేసే ప‌న‌మ్మాయితో హీరోగారి ల‌వ్‌స్టోరి ఏంట‌నేది? సినిమా క‌థ‌. జీవ‌న్‌బాబు సంగీతం అందిస్తున్నారు. అన్న‌ట్టు ఈ సినిమాకి `మెయిడ్‌`ఎన్ ల‌వ్‌స్టోరి అంటూ ఆస‌క్తిక‌ర ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అంటే ప‌న‌మ్మాయితో ల‌వ్ ఇప్పుడే ఆరంభం అయ్యింద‌న్న‌మాట‌!!

User Comments