రాక్ష‌సుడు ద‌ర్శ‌కుడితో రవితేజ

సినిమా హిట్టా ఫ్లాపా అనేది ర‌వితేజ‌కి సంబంధ‌మే ఉండ‌దు. సినిమా త‌ర్వాత సినిమా చేస్తూ వెళ్ల‌డ‌మే ఆయ‌న శైలి. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఆయ‌నకి ఎప్పుడో ముద్ర‌ప‌డిపోయింది. సినిమా ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇటీవ‌లే `డిస్కోరాజా`గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఎలా ఉంద‌నే విష‌యంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా ఆ సినిమాకి మంచి ఓపెనింగ్సే వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క `క్రాక్‌` అనే సినిమాని ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కించాడు. తాజాగా మ‌రో సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సత్యనారాయణ కోనేరు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. రాక్ష‌సుడుతో హిట్టు కొట్టిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వీళ్లు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని