మ‌రో మాస్‌రాజా అనుకుంటే!

Last Updated on by

ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే! ప్ర‌తి కుక్క‌కు ఒక రోజొస్తుంది… ఈ కుక్క‌కు ఈరోజు వ‌చ్చింది!! ఇదీ `బిజినెస్‌మేన్‌` సినిమాలోని పంచ్ డైలాగ్‌. ఈ డైలాగ్‌లోలానే ఉంటుంది ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితి. ఎప్పుడు ఏ కుక్క‌కు ఎలాంటి సీనుంటుందో చెప్ప‌లేం!! ఇక్క‌డ బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి… ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి. రాత్రికి రాత్రే అన్నీ మారిపోతాయ్‌. పెద్ద స్థాయికి ఎదిగేస్తాడు అనుకున్న హీరో సైతం కొన్ని త‌ప్పిదాల‌తో కెరీర్‌ని న‌ష్ట‌పోయిన స‌న్నివేశం ఉంది. ఆ కేట‌గిరీలో ఎంద‌రో కుర్ర‌హీరోలు ఉన్నారు.

అదంతా అటుంచితే యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ `ఉయ్యాల జంపాల‌` చిత్రంతో దూసుకొచ్చిన తీరు చూస్తే, అత‌డు కెరీర్ ప‌రంగా ఎక్క‌డికో ఎదిగేస్తాడ‌ని, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు ఆల్ట‌ర్నేట్ అవుతాడ‌ని భావించారంతా. కానీ ఎక్క‌డో లెక్క త‌ప్పింది. సెల‌క్ష‌న్ ఫెయిలైంది. అదృష్టం కాస్తా .. దురదృష్టంగా మారింది. ప్ర‌తి ఒక్క హీరోకి ఇలాంటి ఒక ఫేజ్ ఉంటుంది స‌రే!.. అయితే ఈ ద‌శ‌ను అధిగ‌మించి గ‌ట్టెక్క‌డ‌మెలా? అన్న‌దే ఇంపార్టెంట్‌. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ సినిమా ఫ్లాప్.. అటుపై వెంట‌నే రాజుగాడు ఫ్లాప్ అవ్వ‌డంతో అత‌డికి ఏం చేయాలో తెలీని ప‌రిస్థితి. ట్రేడ్‌కి కావాల్సింది స‌క్సెస్ మాత్ర‌మే. ఓపెనింగులు క‌నీసం తేగ‌లిగే స‌త్తా ఉండాలి. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో రాజ్‌త‌రుణ్ ఆ రెండిటికీ దూర‌మ‌య్యాడు. అయితే కెరీర్ సందిగ్ధంలో ప‌డినా … . అత‌డికి మ‌రో అవ‌కాశం ఉండ‌నే ఉంటుంది. ఇప్పుడున్న స‌న్నివేశంలో ఫ్లాప్ హీరోల‌కు అవ‌కాశాలిచ్చేవాళ్లున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య నిర్మాత‌ సి.క‌ళ్యాణ్ నిర్మించే సినిమాకి రాజ్‌త‌రుణ్‌ సంత‌కం చేశాడు. ఇదో త‌మిళ రీమేక్ అని తెలుస్తోంది. అయితే వ‌చ్చిన ఏ అవ‌కాశం అయినా త‌న‌దైన ఇంటెలిజెన్స్‌తో త‌న‌కు అనువుగా మ‌లుచుకుని.. ఫలితాన్ని శాసించే తెలివితేట‌లు ఉన్న‌పుడే రియ‌ల్ హీరో. ఆ హీరోయిజం రాజ్‌త‌రుణ్ అందిపుచ్చుకుంటాడ‌నే భావిద్దాం. అయితే అత‌డిలో అస‌లు లోపం ఎక్క‌డుంది? అన్న‌ది అత‌డే క‌నిపెట్టాల్సి ఉంది.

User Comments