అస‌లు మాస్‌రాజా స్టామినా ఎంత‌?

Last Updated on by

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ స్టామినా ఎంత‌? అత‌డి బిజినెస్ ఏ లెవ‌లు? అస‌లింత‌కీ నేల టిక్కెట్ ఎంత ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది? వివ‌రాల్లోకి వెళితే ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు నిగ్గు తేలాయి. గ‌త కొంత‌కాలంగా ఫ్లాపులు ఇబ్బంది పెట్టినా, ఒకే ఒక్క `రాజా ది గ్రేట్‌` అత‌డిని తిరిగి బ్యాక్ టు ట్రాక్ తెచ్చింది. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్కులో ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం `నేల టిక్కెట్టు` బిజినెష్ ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ 48 కోట్ల మేర సాగిందిట‌. ఇందులో థియేట్రిక‌ల్ రిలీజ్ వ్యాల్యూ మాత్రం 22కోట్లు. ఆ మేర‌కు షేర్ వ‌సూళ్లు సాధించ‌గ‌లిగితే `నేల టిక్కెట్టు` హిట్టు కొట్టిన‌ట్టేన‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

ఏరియా వైజ్ ప్రీరిలీజ్ బిజినెస్ లెక్క‌లు చూస్తే.. ఏపీ, తెలంగాణ హ‌క్కులు 18.55కోట్లు. క‌ర్నాట‌క 1.45కోట్లు, ఓవ‌ర్సీస్ 1.5 కోట్లు. నైజాం-6.6కోట్లు, సీడెడ్ -3.05కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-2.15కోట్లు, తూ.గో జిల్లా-1.45కోట్లు, ప‌.గో జిల్లా-1.25కోట్లు, కృష్ణ‌-1.45కోట్లు, గుంటూరు-1.8కోట్లు, నెల్లూరు-80ల‌క్ష‌లు, ఇత‌ర‌చోట్ల‌-50ల‌క్ష‌ల మేర‌ బిజినెస్ పూర్త‌యింది. శాటిలైట్ -13కోట్లు, హిందీ డ‌బ్బింగ్ రైట్స్- 12కోట్లు, ఇత‌ర మార్గాల్లో 1కోటి బిజినెస్ సాగింది. అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌వితేజ `నేల టిక్కెట్టు` 50కోట్ల మేర బిజినెస్ డీల్స్ సాగించింది. ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదండోయ్‌!

User Comments