ర‌వితేజ‌ వార‌సుడు హీరోగా?

Last Updated on by

మాస్ మ‌హారాజా ర‌వితేజ లేటు(వ‌య‌సులో)గా వ‌చ్చినా లేటెస్టుగా హీరో అయ్యి, అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కాస్తా, అనూహ్యంగా హీరో అయిపోయాడు. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇచ్చిన లిఫ్ట్‌తో, మెగాస్టార్ చిరంజీవి- మెగా ఫ్యాన్స్ అండ‌దండ‌ల‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. స్వ‌యంకృషితో ఎనర్జిటిక్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుని 10కోట్ల పారితోషికం రేంజు హీరో అయ్యాడు. అదేమీ ఆషామాషీ జ‌ర్నీ కాదు. అయితే అత‌డి సుపుత్రుడు కూడా తండ్రి అంత పెద్ద హీరో అవుతాడా? అంటూ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కీ మాస్ మ‌హారాజా వార‌సుడు హీరో అవుతున్నాడా? ఎప్పుడు బ‌రిలో దిగుతాడు? అంటే  దీనికి పూర్తి క్లారిటీ లేనేలేదు. ఇదే విష‌య‌మై శ్రీ‌నువైట్ల‌ని ప్ర‌శ్నిస్తే.. ప్ర‌స్తుతం ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ పూర్తిగా స్ట‌డీమీద‌నే శ్ర‌ద్ధ పెట్టాడ‌ని తెలిపారు. న‌ట‌శిక్ష‌ణ ఏదైనా తీసుకుంటున్నాడా.. అంటే పూర్తిగా అవ‌గాహ‌న లేద‌ని అన్నారు. ఇక‌పోతే మ‌హాధ‌న్ న‌ట‌శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. అలాగే `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రంలో అత‌డు న‌టించాల్సి ఉన్నా.. అమెరికా షెడ్యూల్స్‌కి వ‌ర్క్ ప‌ర్మిట్లు, వీసాలు ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో కుద‌రలేద‌ని, ఆ క్ర‌మంలోనే త‌ను స్ట‌డీలో బిజీ అయిపోవ‌డంతో వేరే వాళ్ల‌తో రీప్లేస్ చేయాల్సి వ‌చ్చింద‌ని వైట్ల తెలిపారు. ఇప్ప‌టికైతే మ‌హాధ‌న్‌ని కెరీర్ పేరుతో స్ట‌డీస్ పాడు చేసే ఆలోచన మాస్ రాజాకు లేద‌ని వైట్ల స్పంద‌న‌ను బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మ‌హాధ‌న్ హీరో అవ్వాలంటే అంత‌కు ముందే పూర్తి స్థాయిలో న‌ట‌శిక్ష‌ణ‌, డ్యాన్సులు, ఫైట్స్‌లో త‌ర్ఫీదు ఉంటుంది. అందుకు నిపుణుల స‌మ‌క్షంలో స్పెష‌ల్ ట్రైనింగ్  ప్లాన్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికైతే గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ కి మ‌హాధ‌న్ దూరంగా ఉన్న‌ట్టే.

User Comments