చుక్క‌ల్లో ఏడెక‌రాల‌ సెట్

Last Updated on by

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఓ మ‌హ‌దాద్భుతం జ‌ర‌గ‌బోతోందా? బాహుబ‌లి సిరీస్‌ని, దంగ‌ల్ రికార్డుల్ని కొట్ట‌బోయే సినిమా ఇండియాలో రాబోతోందా? అంటే అవున‌నే మెగాభిమానులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అన్నిటినీ కొట్టాల‌నే పంతంతోనే ఉంది కొణిదెల కంపెనీ. అందుకే సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించేందుకు చ‌ర‌ణ్ బ‌రిలో దిగార‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. మునుముందు బాలీవుడ్‌లోనూ ఈ త‌ర‌హా హిస్టారిక‌ల్ సినిమాలు రిలీజ్‌ల‌కు వ‌స్తున్న దృష్ట్యా వాట‌న్నిటి స్టాండార్డ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ వారియ‌ర్ సినిమాని తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నారు చిరు-చ‌ర‌ణ్‌-సురేంద‌ర్ రెడ్డి బృందం. అందుకే ప్ర‌తి విష‌యంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. రాజీ లేకుండా శ్ర‌మిస్తున్నారు. మొద‌లెట్టిన ఆర్నెళ్ల‌లో కేవ‌లం 25శాతం షూటింగ్ మాత్ర‌మే పూర్త‌యిందంటే మెగా కాంపౌండ్ తీసుకుంటున్న శ్ర‌ద్ధాస‌క్తులు, జాగ్ర‌త్త‌ను గ‌మ‌నించి తీరాలి.

ఇక‌పోతే సైరాలో పోరాట స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకించి హాలీవుడ్ నుంచి స్పెష‌లిస్టుని దించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. హాలీవుడ్‌ మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుడు, ఫైట్ కొరియోగ్రాఫ‌ర్ గ్రెగ్ పావెల్‌తో ఫైట్స్‌ని కొరియోగ్రాఫ్ చేయిస్తున్నారంటే ప్ర‌తిష్ఠ గురించి చిరు బృందం ఏ రేంజులో పాకులాడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. బాండ్ – స్కైఫాల్‌, హ్యారీపోట్ట‌ర్‌, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 6 సినిమాల‌కు ఫైట్స్ అందించిన స్ట‌న్నింగ్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్‌ సైరా- న‌ర‌సింహారెడ్డి చిత్రానికి భారీ వార్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలియ‌గానే అంత‌ర్జాతీయ స్థాయిలో సైరాపై ఆస‌క్తి పెరిగింది. హైద‌రాబాద్ కోకాపేట‌లో ఏడెక‌రాలు లీజ్‌కి తీసుకుని అక్క‌డ భారీ సెట్స్ వేయ‌డ‌మే గాకుండా ఇందులో చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్‌సేతుప‌తిపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఏడెక‌రాల్లో సెట్ నిర్మాణం అంటే ఖ‌ర్చు కూడా ఆ రేంజులోనే ఉంటుంద‌ని చెబుతున్నారు. నాటి వాతావ‌ర‌ణాన్ని ఎలివేట్ చేస్తూ వేస్తున్న ఈ సెట్ కోసం ఏకంగా 10కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆగ‌ష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రో్జు సంద‌ర్భంగా సైరా ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌ని లాంచ్ చేయ‌నున్నార‌న్న‌ది మ‌రో అప్‌డేట్‌.

User Comments