మ‌త్తు వ‌ద‌ల‌రా మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  సింహా కోడూరి, న‌రేష్ అగ‌స్త్య‌, అతుల్య త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 25 డిసెంబ‌ర్ 2019
కెమెరా: సురేష్ స‌రంగం
సంగీతం:  కాల‌భైర‌వ‌
నిర్మాత‌లు:  చిరంజీవి (చెర్రి)-హేమ‌ల‌త‌
ద‌ర్శ‌క‌త్వం:  రితేష్

ముందు మాట‌:
మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి వార‌సుల్లో శ్రీ‌ సింహా కోడూరి హీరో అవుతుంటే కాల భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. `మ‌త్తు వ‌ద‌ల‌రా` అనేది టైటిల్. జ‌క్క‌న్న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకి కొత్త కుర్రాడు రితేష్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైంది. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖ వ్య‌క్తి వార‌సులు సినీఆరంగేట్రం చేస్తుండ‌డం.. పైగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో మ‌త్తువ‌ద‌ల‌రాపై కొంత డిస్క‌ష‌న్ సాగింది. అయితే నిజంగానే ఈ చిత్రం అంత‌గా మ‌త్తు వ‌దిలించిందా? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థా క‌మామీషు:
బాబు మోహన్ (శ్రీ సింహా) న‌గ‌రంలో చాలీ చాల‌ని జీతంతో డెలివ‌రీబోయ్ గా ప‌ని చేస్తుంటాడు. వ‌న్ ఫైన్ డే ఫ్ర‌స్టేషన్ తో విలేజ్ కి వెళ్లిపోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేస్తాడు. ఆ టైమ్ లో త‌న స్నేహితుడు ఏసు (సత్య) ఇచ్చిన స‌ల‌హాతో తెలివిగా క‌స్ట‌మ‌ర్ ని మోసం చేసి డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. తొలి ఎటెంప్ట్ లోనే మ‌త్తు వ‌దిలేంత షాక్ త‌గులుతుంది. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలతో ఓ మర్డర్ అండ్ డ్ర‌గ్ కేసులో ఇరుక్కుని అటుపై ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏం చేశాడు? అన్న‌దే సినిమా. కేసు అంటే అంత సులువా.. దానికోసం ఎన్ని పాట్లు ప‌డ్డాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

ఒక స‌న్న‌ని స్టోరి లైన్ ఎంచుకుని ఫ‌స్టాఫ్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ.. ప్రీఇంట‌ర్వెల్ ముందు క్యూరియాసిటీ పెంచ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. సెకండాఫ్ స్టార్టింగ్ బావున్నా.. ఆ త‌ర్వాత ఎందుక‌నో ట్విస్టులు రివీలైపోవ‌డంతో త‌ర్వాత చ‌ప్ప‌బ‌డిపోతుంది. అయితే ఇందులో స‌త్య కామెడీ సినిమాని పైకి లేపింద‌నే చెప్పాలి. కొత్త ద‌ర్శ‌కుడు కొన్ని త‌ప్పిదాలు చేసినా వాట‌న్నిటినీ క‌ప్పి పుచ్చే కామెడీ కంటెంట్ ఆదుకుంద‌ని చెప్పాలి. స‌త్య ఎక్స‌లెంట్ కామెడీ టైమింగ్ సినిమాకి ప్ల‌స్. ఒక ట్రెండీ న్యూ ఏజ్ సినిమా చూసిన ఫీల్ ని క‌లిగించ‌డంలో స‌క్సెస‌య్యారు.  ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ సెకెండ్ హాఫ్ లో మిస్ అవ్వడం అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. కొన్ని త‌ప్పులు ఉన్నా.. సినిమా వ‌ర్క‌వుటైంది. అయితే అది ఒక సెక్ష‌న్ ఆడియెన్ కి మాత్ర‌మే చేరే కంటెంట్ తో తెర‌కెక్కింద‌ని చెప్పొచ్చు.

న‌టీన‌టులు:
మొద‌టి సినిమానే అయినా  హీరో శ్రీసింహా చ‌క్క‌గానే నటించాడు. మర్డర్ కేసు లో ఇరుకునే సన్నివేశాల్లో కూడా చాల సెటిల్డ్ గా నటించాడు. అయితే అత‌డు ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక క‌థానాయిక పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. ఈ సినిమాకి శ్రీ‌స‌త్య న‌ట‌న‌.. కామెడీ టైమింగ్ పెద్ద ప్ల‌స్. సత్య తన కామెడీతో ఈ సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాల పై న‌డిపాడు. ఇత‌ర పాత్ర‌ధారులు ఓకే.

టెక్నీషియ‌న్స్:
కొత్త ద‌ర్శ‌కుడు రితేష్ రాణా ఒక చ‌క్క‌ని లైన్ తీసుకుని  అద్భుతంగా నేరేట్ చేశాడు. అయితే ఎంచుకున్న క‌థ ల‌ఘు చిత్రాల‌కు స‌రిప‌డే లైన్. దానివ‌ల్ల రెండు గంట‌ల సినిమాగా సాగ‌దీసేప్ప‌టికి అది కాస్తా ఇబ్బందిక‌రం అయ్యింఇ. కాల‌భైర‌వ సంగీతం ప్ల‌స్. నేప‌థ్య సంగీతం ట్రెండీగా క్యాచీగా చ‌క్క‌గా కుదిరింది. కెమెరా వ‌ర్క్.. ప్రొడ‌క్ష‌న్ డిజైన్ స్ట‌న్నింగ్‌. ఎడిటింగ్ మ‌రింత బెట‌ర్ గా చేయాల్సింది. కొంత లెంగ్త్ త‌గ్గించాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

* ఎంచుకున్న లైన్, క‌థ‌లో టింజ్.. న్యూఏజ్ డ్రామా
* స‌త్య కామెడీ
* నేప‌థ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
*సెకండాఫ్ ల్యాగ్
* రొటీనిటీ

ముగింపు:
మ‌త్తు.. ఎక్కింది కానీ!!

రేటింగ్:
2.75/5