శ‌ర్వా వ‌ర్సెస్ దేవ‌ర‌కొండ‌

Last Updated on by

యంగ్ హీరోలు శ‌ర్వానంద్ – విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుందా? ఆ ఇద్ద‌రితో సీనియ‌ర్ హీరో సూర్య పోటీప‌డబోతున్నారా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. ఆ ముగ్గురి మ‌ధ్యా బిగ్ ఫైట్ ఖాయ‌మైంది. ఆ ముగ్గురి సినిమాల‌కు రిలీజ్ తేదీలు ఖాయ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా యువ‌హీరోలు శ‌ర్వా, దేవ‌ర‌కొండ మ‌ధ్య బిగ్ ఫైట్ టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ‌వ్వ‌డం అన్న‌ది మంచిది కాద‌న్న అభిప్రాయం ట్రేడ్ లో ఉంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆ మేర‌కు అంద‌రికీ న‌ష్ట‌మే కాబ‌ట్టి వారం గ్యాప్ తో రిలీజ్ చేయాల‌న్న ప్ర‌తిపాద‌నా ఉంది.

సూర్య – సెల్వ‌రాఘ‌వ‌న్ కాంబినేష‌న్ మూవీ `ఎన్జీకే` తెలుగు, త‌మిళంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. టీజ‌ర్, పోస్ట‌ర్ల‌తోనే హైప్ నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఆ చిత్ర బృందంతో దేవ‌రకొండ‌- మైత్రి మూవీ మేక‌ర్స్ చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. వారం గ్యాప్ తో రిలీజ్ చేయాలంటే ఇరువురిలో ఎవ‌రో ఒక‌రు త‌గ్గాల్సి ఉంటుంది. అయితే ఎవ‌రు రిలీజ్ విష‌యంలో త‌గ్గుతారు? అన్న‌ది తేల‌లేదింకా. ఇక‌పోతే యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రాన్ని మే 31న రిలీజ్ చేసేందుకు అధికారికంగా తేదీ ఖాయం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికి ఇది ముక్కోణ‌పు పోటీ కిందే లెక్క‌. రిలీజ్ తేదీల మార్పున‌కు సంబంధించి ఎవ‌రికి వారు అధికారికంగా ప్ర‌క‌టించే వార‌కూ మే 31నే ఖాయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దేవ‌ర‌కొండ సినిమాకి ఎన్జీకేకి కొన్ని సారూప్య‌త‌లు ఉన్నాయి. ఆ రెండిటిలో క‌థానాయ‌కులు రెబ‌ల్ యాటిట్యూడ్ ఉన్న విద్యార్థులుగా క‌నిపించ‌నున్నారు. దేవ‌ర‌కొండ కాకినాడ బుల్లోడిగానూ క‌నిపిస్తారు. శ‌ర్వానంద్ తాజా చిత్రం (శ‌ర్వా 27)లో కాస్త ఏజ్డ్ డాన్ గా క‌నిపిస్తూనే యువ‌కుడిగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

User Comments