మే ద్వితియార్థం ట్రీట్ ఇచ్చేవి ఇవే!

`మ‌హ‌ర్షి` సినిమాతో చిన్న సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. నెల రోజుల ముందుగానే మ‌హ‌ర్షి టీమ్ రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించ‌డంతో లో బ‌డ్జెట్ సినిమాల‌కు ఓ క్లారిటీ దొరికింది. దీంతో వాళ్ల ప్లెక్స్ బులిటిని…ఆడియ‌న్స్ ని దృష్టిలో పెట్టెకుని రిలీజ్ డేట్ లు ఖ‌రారు చేసుకున్నారు. ఇక మే లో మండే ఎండ‌ల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి అంటే?

మే 11న జీవా న‌టించిన డ‌బ్బింగ్ సినిమా కీ విడుద‌ల‌వుతుంది. అనంత‌రం మే 17న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిఖిల్ న‌టించిన `అర్జున్ సూర‌వ‌రం`, `అల్లుశిరీష్` న‌టించిన `ఏబీసీడీ`, `స్వ‌యం వ‌ధ` 17న బాక్సాఫీస్ పోరుకు రెడీగా ఉన్నాయి. అదే నెల‌ 24న యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన `క‌ల్కీ`, బెల్లంకొండ సాయి శ్రీనివాస్- తేజ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `సీత‌` తో పాటు, `ఎవ‌రూ త‌క్కువ కాదు`, `బుర్ర క‌థ‌`, `నాగ‌క‌న్య` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక మే చివ‌రి రోజైన‌ 31న సూర్య న‌టిస్తోన్న `ఎన్జీకే` భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అవుతోంది. దీంతో పాటు `ఎవ‌డైనా జాగ్ర‌త్త‌`, `విశ్వా మిత్ర‌`, `అభినేత్రి-2`, `సువ‌ర్ణ సుంద‌రి` విడుద‌ల అవుతున్నాయి. ఇంకా రిలీజ్ కావాల్సిన కొన్ని అనువాద‌, స్ర్టెయిట్ సినిమాల డేట్ల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.