సిద్ధార్థ్‌ని మ‌రిచిన మీడియా

Last Updated on by

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ఆహ్ల‌ద‌క‌ర‌మైన చిత్రాల్లో న‌టించే క‌థానాయ‌కుడిగా.. ల‌వ‌ర్‌బోయ్‌గా.. చాక్లెట్‌బోయ్‌గా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ అస‌లేమ‌య్యాడు? తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ద‌శాబ్ధ కాలం తిరుగులేని ఆధిప‌త్యం సాధించిన ఈ హీరో ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడు? చాలాకాలంగా అభిమానుల్లో ఓకింత సందిగ్ధం. అత‌డిని అభిమానించి, ప్రేమించిన వీరాభిమానుల‌కు ఇది ఇప్ప‌టికి ఎప్ప‌టికి ఓ ఫజిల్‌. అయితే స‌క్సెస్ మాత్ర‌మే నిల‌బెట్టే ఈ ప‌రిశ్ర‌మ‌లో సిద్ధార్థ్ ప‌రాజ‌యాల బాట ప‌ట్ట‌డం పెద్ద మైన‌స్ అనుకుంటే, కెరీర్ ప‌రంగా చేసిన ఇత‌ర‌త్రా త‌ప్పులు అత‌డిని వెంటాడాయ‌ని చెబుతారు. అంతేకాదు తెలుగు మీడియాతో సిద్ధార్థ్ అప్ప‌ట్లో వివాదాల్లోకి రావ‌డం కూడా వ్య‌తిరేక ఫోర్సెస్ ప‌ని చేయ‌డానికి కార‌ణ‌మైంద‌న్న వాద‌నా ఉంది. బోయ్స్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, బొమ్మ‌రిల్లు .. వంటి క్లాసిక్స్‌లో న‌టించిన సిద్ధార్థ్ .. ఇలా కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డ‌తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇటీవ‌లే హార‌ర్ చిత్రం `గృహం`తో విజ‌యం అందుకున్నా మెయిన్ స్ట్రీమ్ హీరోగా మాత్రం ఇంకా స‌ర్ధుకోలేదు. గృహం ఇటు తెలుగులో, అటు అవ‌ల్ పేరుతో త‌మిళ్‌లో విజయం అందుకున్నా, ఆ పేరు ద‌ర్శ‌కుడికి, టెక్నిక్‌కి వ‌చ్చిందే కానీ సిద్ధూకి రాలేదు. దాంతో మ‌ళ్లీ అత‌డు స్టార్‌డ‌మ్‌ని అందుకునే వేరొక ఆప్ష‌న్‌ని వెతుక్కోవాల్సి వ‌చ్చింది.

sidharth

అయితే సిద్ధార్థ్ చూపు ప్ర‌స్తుతం తెలుగు ప‌రిశ్ర‌మ కంటే మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌పై ప‌డింద‌ని రీసెంటుగా అత‌డు న‌టించిన `క‌మ్మ‌ర‌సంభ‌వం` ప్ర‌య‌త్నం చెబుతోంది. తొలి ఎటెంప్ట్‌ యావ‌రేజ్ గా నిలిచింద‌క్క‌డ‌. సిద్ధార్థ్‌కి మాత్రం న‌టుడిగా పేరొచ్చింది. ఇక‌పోతే సిద్ధార్థ్ కి ఇప్ప‌టికీ తెలుగులో వీరాభిమానులున్నారు. అత‌డు మ‌ళ్లీ నువ్వొస్తానంటే.. బొమ్మ‌రిల్లు వంటి సంచ‌ల‌నాల‌తో తెర‌పైకొస్తే త‌ప్ప‌క ఆద‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. నేడు పుట్టిన‌రోజు వేళ సిద్ధూకి అభిమానులంతా సామాజిక మాధ్య‌మాల‌లో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అయితే తెలుగు మీడియా మాత్రం ఈ విష‌యంలో సీత‌క‌న్నేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఫేమ్‌లో ఉంటేనే ఇక్క‌డ ప‌దే ప‌దే స్మ‌రిస్తారు. లేదంటే వెంట‌నే మ‌ర్చిపోతార‌ని ప్రూవైంది.

 

sidharth

User Comments