ప‌వన్ పై కుట్ర మ‌ళ్లీ మొద‌లైందా..?

Last Updated on by

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఒంట‌రివాడు అయితే కాదు. ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీ స‌పోర్ట్ కూడా బాగానే ఉంది. ఆయ‌న ఏం చేసినా కూడా వెన‌క ఉండ‌టానికి అభిమానులు కూడా ఉన్నారు. ఇవ‌న్నీ చూసుకుని ఇప్పుడు పోరాటానికి సై అంటున్నారు ప‌వ‌ర్ స్టార్. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఆయ‌న పాయింట్ చేసిన మీడియా సంస్థ‌లే ఇప్పుడు ప‌వ‌న్ పై యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. త‌న‌పై కుట్ర జ‌రిగిందంటూ.. గ‌త ఆర్నెళ్లుగా త‌న‌పై కావాల‌నే కుట్ర పూరిత వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నారంటూ టివి 9, ఏబిఎన్, మ‌హాన్యూస్ పై ప‌వ‌న్ సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఆయ‌నపై ఆయా ఛానెల్స్ కూడా ప్ర‌తీకార చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ కొన్ని వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఏబిఎన్ లో అయితే ఆర్కే ఏకంగా ప్రోమో కూడా వేసాడు. ప‌వ‌న్ వ్యక్తిగ‌త జీవితంపై కూడా ప్ర‌త్యేకంగా ఓ ప్రోమోను క‌ట్ చేసి ప్ర‌సారం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్, రేణు దేశాయ్ విష‌యాల‌ను కూడా ఇందులో డిస్క‌స్ చేయ‌బోతున్నాడు ఆర్కే. మ‌రోవైపు టివి 9 కూడా ప‌వ‌న్ పై ప్ర‌త్యేకంగా కొన్ని వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప‌వ‌న్ కు, ఆ రెండు ఛానెల్స్ కు మ‌ధ్య యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌ట్లేదు.

User Comments