మీకు మాత్ర‌మే చెప్తా రివ్యూ

Meeku Maathrame Cheptha Movie Review

న‌టీన‌టులు: త‌రుణ్ భాస్క‌ర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం త‌దిత‌రులు
నిర్మాత‌:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌
బ్యాన‌ర్ : కింగ్ ఆఫ్ ది హిల్‌
ద‌ర్శ‌క‌త్వం: షమ్మీర్ సుల్తాన్

ముందు మాట‌:
హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న‌ తొలి  సినిమా `మీకు మాత్రమే చెప్తా`. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ని క‌థానాయ‌కుడిగా ప‌రిచయం చేస్తున్నాడు. హీరోగానే కాదు నిర్మాత‌గా స‌క్సెస‌వుతాన‌న్న ధీమాని క‌న‌బ‌రిచాడు. త‌న వ‌ద్ద ఉన్న 70శాతం సంపాద‌న‌ను పెట్టుబ‌డిగా పెట్టాన‌ని .. ఆ 70శాతం బిజినెస్ రూపంలో రాబ‌ట్టుకున్నాన‌ని చెప్పాడు. ఇక ట్రైల‌ర్ ని బ‌ట్టి ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మైంది. విజువ‌ల్స్ సోసోనే అయినా సినిమాలో ఏదైనా మ్యాజిక్ చేస్తార‌నే భావించారు. అయితే ఈ సినిమా క‌మామీషు ఏమిట‌న్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ క‌మామీషు:

సోష‌ల్ మీడియా డిజిట‌ల్ యుగంలో లీక్డ్ వీడియోల ప‌ర్య‌వ‌సానం ఏమిటి? అన్న‌దే ఈ సినిమా సింగిల్ లైన్. అజాగ్ర‌త్త‌గా కొంటె వేషాలు వేస్తే ఆ వీడియోలు లీకై కొంప‌లంటుకునే సంద‌ర్భం రావొచ్చు. అది పెళ్లి ఆగిపోయే వ‌ర‌కూ కూడా వెళ్లొచ్చు. అలాంటి ముప్పు ఏర్ప‌డిన ఓ కుర్రాడు దానినుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అందుకు త‌న స్నేహితులు ఎలాంటి సాయం చేశారు?  ఇందులో అన‌సూయ క్యారెక్ట‌ర్ ఏమిటి? అన్న‌దే మిగ‌తా క‌థాంశం. క‌థ‌నంలోకి వెళితే.. తరుణ్ భాస్కర్ .. త‌న ప్రియురాలు వాణి భోజన్‌ను పెళ్లాడేందుకు ప్రిప‌రేష‌న్స్ లో ఉంటాడు. ఈలోగానే ఎక్క‌డి నుంచో అకస్మాత్తుగా అతని ఫోన్ కి ఓ వీడియో వస్తోంది. ఆ వీడియో త‌న‌ కొంటె వేషాల ప్ర‌యివేట్ వీడియో. ఆ వీడియో బ‌య‌ట‌కు లీకైతే కొంప‌లు అంటుకు పోతాయ‌ని పెళ్లాగిపోతుంద‌ని టెన్ష‌న్ ప‌డుతుంటాడు. ఎలాగైనా ఆ వీడియో తీసిన వారి ఆచూకీ ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అందుకు త‌న స్నేహితులు సాయం చేస్తారు. ఆ వీడియో లీక్ చేసిన హ్యాక‌ర్ ఎవ‌రో క‌నిపెట్టాక కూడా మ‌రో ట్విస్టు. ట్విస్టుల మీద ట్విస్టుల అనంత‌రం ఆ హ్యాక‌ర్ ఎవ‌రో క‌నిపెట్టారా లేదా?  చివ‌రికి వాణీతో త‌రుణ్ పెళ్లి అయ్యిందా లేదా? అన్న‌దే సినిమా.

ఫ‌స్టాఫ్‌ డీసెంట్ గా సాగింది. త‌రుణ్ -అభిన‌వ్ కామెడీ కుదిరింది. అయితే చాలావ‌ర‌కూ కొత్త కుర్రాళ్ల‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో క‌నెక్ట‌వ్వ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. సింగిల్ లైన్ లో సినిమా ఆద్యంతం ర‌న్ చేశారు. ఇక సెకండాఫ్ లో అదే టెంపో ర‌న్ అయ్యి ఉంటే బావుండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అదే గ‌నుక కుదిరితే టార్గెటెడ్ ఆడియెన్ ని ఈ సినిమా రీచ్ అయ్యి ఉండేదే. కానీ సెకండాఫ్ ఆ టెంపో కుద‌ర‌లేదు. ఇంట‌ర్వెల్ త‌ర్వాత‌ గాళ్ ట్విస్టుతో మొద‌ల‌వ్వ‌డం .. లీక్డ్ వీడియోకి కార‌ణం త‌రుణ్ బంధువైన ఒక అమ్మాయి క‌నిపించ‌డం… స్నేహితుల‌తో ఎపిసోడ్స్.. హ్యాక‌ర్ బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్స్ వ‌గైరా ఆక‌ట్టుకుంటాయి. ఇక సెకండాఫ్ లో మంచి హుషారు ఉంటుంద‌నుకుంటే ప‌ర‌మ రొటీన్ అనిపించింది. అన‌సూయ పాత్ర ఇందులో ఇంపార్టెంట్. వీడియో హ్యాక‌ర్ విష‌యంలో ఫైన‌ల్ లో వ‌చ్చే ఊహించ‌ని ట్విస్ట్ ఆక‌ట్టుకుంది.

న‌టీన‌టులు:  త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్ర హీరోగా ఓకే. హీరోయిన్ వాణి భోజన్ పాత్ర డ‌మ్మీ. తరుణ్- అభినవ్ కాంబినేష‌న్ న‌ట‌న ఫ‌ర్వాలేదు. అనసూయ పెర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణ.

టెక్నీషియ‌న్లు:  తొలి చిత్ర‌ద‌ర్శ‌కుడు జ‌స్ట్ ఓకే. సెకండాఫ్‌ నేరేష‌న్ ప‌రంగా ఇబ్బంది ప‌డ్డాడు. సంగీతం సోసోనే. ఇత‌ర విభాగాలు జ‌స్ట్ ఓకే. నిర్మాణ విలువ‌లు పూర్.

ప్లస్ పాయింట్స్ :
* తరుణ్, అభిన‌వ్, అనసూయల‌ నటన
* కామెడీ.. ఫ‌స్టాఫ్
* వీడియో హ్యాకింగ్ ఎలిమెంట్

మైనస్ పాయింట్స్ :
* సాధార‌ణ కథ
* డ‌ల్ నేరేష‌న్
*  రొటీన్ స్క్రీన్ ప్లే
* అర్బ‌న్ ఆడియెన్ కి మాత్ర‌మే

ముగింపు : ఓన్లీ ఫ‌స్టాఫ్ మాత్ర‌మే క్లిక్
రేటింగ్ : 2.5/5