ప‌వ‌న్ హీరోయిన్ ని అలా చూసి షాక్ అయ్యారు

ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? ఒక్క‌సారి చూస్తే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే అక్క‌డున్న అమ్మాయి అలా మారిపోయింది క‌దా మ‌రి. ఒక‌ప్పుడు మ‌న సినిమాల్లో చాలానే న‌టించింది.. ఇక్క‌డి స్టార్ హీరోల‌తో కూడా ఆడిపాడింది. ప‌వ‌న్ తోనూ ఓ సినిమాలో రొమాన్స్ చేసింది. ఇక ర‌వితేజ‌తో భ‌ద్ర‌లో జోడీ క‌ట్టిన ముద్దుగుమ్మే పైన క‌నిపిస్తున్న మీరాజాస్మిన్. అప్ప‌ట్లో బొద్దుగా ఉన్న ఈ భామ‌.. ఇప్పుడు ఆంటీలా మారిపోయింది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా త్వ‌ర‌గా మారిపోతుంటారు. పెళ్లైతే వాళ్ల‌ను గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మే. అంత‌గా ఫిజిక్ మారిపోతుంది. హీరోయిన్లు కూడా చాలా క‌ష్ట‌ప‌డి పెళ్లి త‌ర్వాత త‌మ ఫిజిక్ కాపాడుకుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఈజీగా లావైపోతుంటారు. ఇందులో మీరాజాస్మిన్ కూడా ఒక‌రు.

దుబాయ్ బిజినెస్ మ్యాన్ అనిల్ జాన్ టైటాస్ ను 2014లో పెళ్ళి చేసుకుంది మీరా. అప్ప‌టికే అనిల్ కు ఓ సారి పెళ్లైంది. అయినా స‌రే.. మీరాను పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌ట్లో మీరా పెళ్లిపై పెద్ద ర‌చ్చే జ‌రిగింది. పోలీసుల భ‌ద్ర‌త మ‌ధ్య.. మొద‌టి భార్య బంధువుల అల్ల‌ర్ల మ‌ధ్య మీరాజాస్మిన్ వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత దుబాయ్ లో సెటిల్ అయిపోయింది ఈ భామ‌. ఈ మ‌ధ్యే మళ్ళీ మలయాళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది మీరా. దీంట్లో భాగంగానే చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట క‌నిపించింది మీరాజాస్మిన్. అన్న‌ట్లు భ‌ర్త అనిల్ తో ఈ మ‌ధ్యే మీరాకు వివాదాలు కూడా వ‌చ్చాయి. వీరి ఇష్యూ విడాకుల వ‌ర‌కు కూడా వెళ్లింది. అనిల్ మొద‌టి భార్య త‌ర‌ఫు బంధువుల నుంచి ప్రాబ్ల‌మ్స్ రావ‌డంతో.. అనిల్, మీరా మ‌ధ్య వివాదం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఇదే వివాదం చిలికి చిలికి గాలివాన‌లా మారి.. విడాకుల వ‌ర‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతానికి భ‌ర్త‌కు దూరంగానే ఉంటుంది ఈ భామ‌. మొత్తానికి ఫిజిక్ లోనే కాదు.. మీరా జీవితంలోనూ చాలా మార్పులు వ‌చ్చాయి.

User Comments