శివాజీ రాజా రిట‌ర్న్ గిప్ట్ పై మెగా బ్ర‌ద‌ర్ కౌంట‌ర్!

`మా` ఎన్నిక‌ల నేప‌థ్యంలో శివాజీరాజా ప్యాన‌ల్ కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌ద్ద‌తివ్వ‌క‌పోవ‌డంతో న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన‌ నాగ‌బాబుకి శివాజీ రాజా రిట‌ర్న్ గిప్ట్ ఇస్తాన‌న‌న్న సంగ‌తి తెలిసిందే. శివాజీ వైకాపాలో చేరిన వెంట‌నే ఈ కామెంట్ చేయడంతో ఇదే మెగా బ్ర‌ద‌ర్కి పెద్ద రిట‌ర్న్ గిప్ట్ అని చెప్పుకున్నారు. అప్ప‌టివ‌ర‌కూ మెగా ఫ్యామిలీ అండ‌తో మా ను న‌డిపించిన శివాజీ రాజా ఇలాంటి ట‌ర్నింగ్ తీసుకోవ‌డంతో? మెగా బ్ర‌ద‌ర్ ని న‌ర‌సాపురంలో ఓడించాలంటూ పిలుపునివ్వ‌డం అంత‌టా చ‌ర్చ‌కొచ్చింది. పొలిటిక‌ల్ కారిడార్ లో ఇలాంటివి కామ‌న్ అయిన‌ప్ప‌టికీ శివాజీ రాజా వ్యాఖ్యాల్లో వ్య‌క్తిగ‌త కోపం ఎక్కువ‌గా క‌నిపించింది.

తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై మెగా బ్ర‌ద‌ర్ కౌంట‌ర్ వేసారు. శివాజీ రాజా ప‌రిపాలన న‌చ్చ‌క న‌రేష్ కు మ‌ద్ధ‌తిచ్చా. అయినా ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడే ఆస‌క్తి నాకులేదన్నారు. జ‌బర్ద‌స్త్ షో కు హోస్ట్ లుగా వ్వవ‌హ‌రిస్తోన్న నాగ‌బాబు, రోజా రాజ‌కీయాల్లో అయిన నేప‌థ్యంలో ఆబాధ్య‌త‌ల్ని శేఖర్ మాస్ట‌ర్, న‌టి మీనా నిర్వ‌ర్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్ధిగా గెలిచినా జ‌బ‌ర్ద‌స్త్ షో లో మాత్రం కంట్యున్యూ అవుతాన‌ని, కానీ సినిమాలు మాత్రం చేయ‌న‌ని నాగ‌బాబు తెలిపారు.