బాలయ్య పైసా వసూల్ లో మెగా పంచ్ లు..?

టాలీవుడ్ మీడియా సర్కిల్ లో ఇప్పుడు ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఎప్పటినుంచో ఆచారంగా వస్తోన్న పంచ్ లు, సెటైర్ల పురాణం గురించి కావడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరోపైన లేక ఇతర సినిమాల పైన పంచ్ లు, సెటైర్లు వేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదేనని అందరికీ తెలుసు. అది ఆ మధ్య మరీ ఎక్కువైపోయి వివాదాలకు దారితీయగా.. ఇప్పుడు కాస్త తగ్గిందనే అనాలి.
కానీ, ఇప్పుడు పంచ్ లు పేల్చడంలో దిట్టైనా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి తనదైన స్టైల్లో పంచ్ లను బాంబుల్లా పేల్చడానికి రెడీ అవుతున్నాడని తెలియడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే, ఆ పంచ్ లలో కొన్ని మెగాస్టార్ చిరంజీవి పైనే పేలనున్నాయని తెలియడం షాక్ ఇస్తోంది. ఇంతకూ మేటర్ ఏంటంటే, పూరీ తన లేటెస్ట్ మూవీ బాలయ్య ‘పైసా వసూల్’ లో చిరు పై కొన్ని మెగా పంచ్ లు వేయించాడని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బాలయ్య క్యారెక్టర్ తో ఆ పంచ్ లు వేయించకుండా.. తెలివిగా కమెడియన్ అలీ క్యారెక్టర్ తో ఆ మెగా పంచ్ లు వేసినట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
చిరు 150వ సినిమాను పూరీ మిస్ చేసుకోవడం.. కథ బాగోలేదని చిరు పబ్లిక్ గా చెప్పడం.. మొదలైన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు పూరీ తన సినిమాలో సెటైర్లు వేశాడా అంటూ కొంతమంది వాదిస్తున్నారు. కానీ, పూరీ చాలా పాజిటివ్ మనిషి అని, అందరితో మంచిగా మెలుగుతూ ఉండే ఓ ముక్కుసూటి మనిషి అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే చిరుతో సినిమా క్యాన్సిల్ అయినా.. ఎప్పటికైనా మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తానని చాలా నమ్మకంగా మాట్లాడిన వ్యక్తి పూరి. మరి అలాంటి పూరీ ఇప్పుడు చిరుపై పంచ్ లు సెటైర్లు వేశాడంటే, నమ్మడం కొంచెం కష్టమే. అందులోనూ చిరు అంటే చాలా ఇష్టం అని చెప్పే పూరీ ఇప్పుడు ఇలా ఇంత తెలివి తక్కువుగా డైలాగ్స్ రాశాడంటే.. నిజం అనిపించదు. మరి ఏది నిజమో, రేపు సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం.