మెగాడాట‌ర్‌ సీక్రెట్ లీక్

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. నేడు అత‌డు న‌టించిన విజేత థియేట‌ర్ల‌లోకి రిలీజై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. నిన్న‌టిరోజున ఓ ఇంట‌ర్వ్యూలో మెగా అల్లుడు చెప్పిన ఓ షాకింగ్ మ్యాట‌ర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌.

అస‌లింత‌కీ మీ సినిమాని వీక్షించిన అనంత‌రం మీ భార్య శ్రీ‌జ ఏం చెప్పారు? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ… అస‌లు శ్రీ‌జ‌కు సినిమాలంటే ఆస‌క్తి లేదు అనేశాడు. అంతేకాదు.. త‌మ ఇంట్లో వాళ్లు ఏ సినిమాల్లో న‌టిస్తున్నారు? అన్న‌ది కూడా స‌రిగా ప‌ట్టించుకోద‌ని, అయితే తాను న‌టిస్తున్న సినిమా గురించి మాత్రం ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యింద‌ని తెలిపాడు. సినిమా చూసి అప్రీషియేట్ చేసింద‌ని అన్నాడు క‌ళ్యాణ్‌. తొలి ప్ర‌య‌త్నం ఫ‌ర్వాలేదు కానీ, అయితే క‌ళ్యాణ్ ఎక్స్‌ప్రెష‌న్స్ ప‌రంగా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంద‌న్న స‌జెష‌న్స్ మీడియా నుంచి వినిపించాయి. ఇక‌పోతే శ్రీ‌జ సినిమా ఫ్యామిలీలో పుట్టిపెరిగినా వాటిపై ఆస‌క్తి చూపించ‌లేదంటే చూసి చూసి బోర్ ఫీల‌య్యారేమో! అన్న సందేహాలు అంద‌రిలో ఉన్నాయిప్పుడు.

User Comments