మెగా డైరెక్ట‌ర్ జన్మదిన వేడుకలు

కోదండ రామిరెడ్డి సీనియ‌ర్ ద‌ర్శ‌కులుగా సుప‌రిచితం. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలంద‌రితో సినిమాలు తీసిన ఆయ‌న మెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించారు. అందుకే ఆయ‌న్ని మెగా డైరెక్ట‌ర్ గానూ పిలుస్తారు. అందుకే ఆయ‌న బి-డే ఈవెంట్ ఆస‌క్తిక‌రంగా సాగింది.

ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : This Bollywood Biggies Bags Chiru’s Next?