కేర‌ళ‌కు మెగా ఫ్యామిలీ 51ల‌క్ష‌లు

కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. 14 జిల్లాల్లో హైఎలర్ట్ ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. సెల‌బ్రిటీల ఇళ్ల‌లోకి నీళ్లు వెళ్లిపోవ‌డంతో అంద‌రూ బెంబేలెత్తిపోతున్నారు. దేవుని దేశంలో ఇలాంటి దారుణ విల‌యం ఇదివ‌ర‌కెన్న‌డూ లేనేలేదు. ఈ విల‌యం చూసి ఇరుగుపొరుగు స్టార్లు వేగంగా స్పందించారు. సెల‌బ్రిటీలంతా డొనేష‌న్ల సాయం చేస్తున్నారు. నిన్న‌నే అల్లు అర్జున్ 25ల‌క్ష‌ల డొనేష‌న్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్ర‌క‌టించాడు.

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వంతు. మెగాస్టార్ అమ్మ‌గారు అంజ‌నా దేవి రూ.1ల‌క్ష కేర‌ళ బాధితుల‌కోసం ప్ర‌క‌టించార‌ట‌. ఆ స్ఫూర్తితో వెంట‌నే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి -25ల‌క్ష‌లు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ -25ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. అంటే కేవ‌లం మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి 51ల‌క్ష‌ల రూపాయ‌లు కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి చేర‌నుంది. ఆ మేర‌కు మూవీ ఆర్టిస్టుల సంఘం నేటి సాయంత్రం ఓ అధికారిక ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. అలానే మూవీ ఆర్టిస్టుల సంఘం ఇదే స్ఫూర్తితో 10ల‌క్ష‌ల డొనేష‌న్‌ని కేర‌ళ‌కు ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్, రానా, విశాల్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, శివ‌కార్తికేయ‌న్‌, ధ‌నుష్‌, సూర్య‌, కార్తి ఇలా స్టార్లంతా డొనేష‌న్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ 5ల‌క్ష‌ల డొనేష‌న్ ప్ర‌క‌టించాడు. బ‌న్ని వాసు గీత‌గోవిందం కేర‌ళ వ‌సూళ్ల‌ను అంకిత‌మిస్తాన‌ని తెలిపాడు. ప్ర‌భాస్ కోటి ప్ర‌క‌టించాడ‌న్న మాటా వినిపించింది. ఇక కేర‌ళ మూవీ ఆర్టిస్టుల సంఘం `అమ్మ` సైతం రూ.10ల‌క్ష‌ల మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్ర‌క‌టించింది

User Comments