వ‌రుడు వేట‌లో మెగా ఫ్యామిలీ!

మెగా డాట‌ర్ నిహారిక సినిమా కెరీర్ ఆశించినంత‌గా సాగ‌లేదు. బుల్లి తెర నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అయినా..మెగా బ్రాండింగ్ ఉన్నా అమ్మ‌డు కెరీర్ లో ఇంకా నిల‌దొక్కుకునే ప‌నిలోనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్, ఈ మ‌ధ్య‌నే విడుద‌లైన సూర్య‌కాంతం ఏదీ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. అటు త‌మిళ్ లో చేసిన ఒక్క సినిమా ప‌రిస్థితి అంతే. ప్ర‌స్తుతం నిహారికి చేతిలో సినిమాలేవి లేవు. వెబ్ సిరీస్ లంటూ ఆ మ‌ధ్య హంగామా చేసినా వాటిని కొన‌సాగించ‌డంలోనూ విఫ‌ల‌మైంది. ఇలా కార‌ణాలు ఎన్ని విశ్లేషించుకున్నా! నిహారిక కెరీర్ మాత్రం ఎక్క‌డి వేసి గొంగ‌డి అక్క‌డే ఉంది.

ఆ మ‌ధ్య మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాన‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్టేట్ మెంట్ ఇచ్చారు. కుల‌, మ‌త ప్రాంతాల‌తో సంబంధం లేదు. గుంణం మించిదైతే చాలని చెప్పారు. తాజాగా మెగా ఫ్యామిలీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్ డేట్ అందింది. మొన్న‌టివ‌ర‌కూ ఎన్నిక‌ల బిజీలో ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడా ప‌నుల నుంచి ఫ్రీ అయింది. ఈ నేప‌థ్యంలో నిహారిక కోసం వ‌రుడిని వెతికే ప‌నులు ముమ్మ‌రం చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే నిహారిక ముందుకు కొన్ని ఫోటోలు కూడా వెళ్లాయ‌ట‌. సినిమా రంగం క‌న్నా బిజినెస్ ప‌ర్సనాల్టీస్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారుట‌. మొత్తానికి స్పీడ్ చూస్తుంటే మెగా ఫ్యామిలీ ఇంట ఈ ఏడాది బ్యాండ్ భాజాలు మ్రోగ‌డం ఖాయ‌మనే అనిపిస్తోంది.