నిహారిక టార్గెట్ 25 కోట్లు

Last Updated on by

నిహారిక కొణిదెల‌.. తెలుగులో భారీ అంచ‌నాల మ‌ధ్య ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్. పైగా కొణిదెల వంశం నుంచి వ‌చ్చిన తొలి హీరోయిన్ కావ‌డంతో ఒక‌మ‌న‌సు భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. కానీ ఏం చేస్తాం.. సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఒక్కోసారి అంతే.. అంచ‌నాలు భారీగా పెట్టుకున్నా అస‌లుకే మోసం వ‌స్తుంటుంది. నిహారిక విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఒక మ‌న‌సులో ఆమె న‌ట‌న‌కు కూడా పెద్ద‌గా మార్పులేమీ ప‌డ‌లేదు. దాంతో నిహా చాలా నిరాశ‌ప‌డిపోయింది. చాన్నాళ్ల వ‌ర‌కు క‌నీసం క‌నిపించ‌లేదు కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి రెండు సినిమాల‌తో వ‌చ్చేస్తుంది ఈ భామ‌. తెలుగులో హ్యాపీవెడ్డింగ్ అంటూ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తుంది నిహారిక‌. ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాట మాత్రం విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్ హీరోతో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో న‌టించింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల కానుంది.

ఈ సినిమా త‌మిళ రైట్స్ 12 కోట్ల‌కు పైగానే అమ్ముడ‌య్యాయి. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే క‌నీసం 25 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయాలి. ఇప్పుడు విజ‌య్ సేతుప‌తికి ఉన్న మార్కెట్ తో పోలిస్తే ఇది చాలా త‌క్కువే అని చెప్పాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే క‌చ్చితంగా హిట్ బాగా ప‌ట్ట‌డం ఖాయం. ఇందులో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే క‌నిపించింది నిహారిక‌. గెట‌ప్ చూస్తుంటే చాలా డిఫెరెంట్ గా అనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని మ‌రికొన్ని లుక్స్ కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ చిత్రంతో క‌చ్చితంగా త‌మిళ‌నాట గుర్తింపు తెచ్చుకుంటాన‌ని ధీమాగా చెబుతుంది నిహారిక‌. ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్ కానీ హిట్టైతే నిహారిక త‌మిళ‌నాటే సెటిల్ అయిపోవ‌డం ఖాయం. మొత్తానికి మ‌రి మెగా డాట‌ర్ జాత‌కం ఎలా తిర‌గ‌నుందో.

User Comments