మెగా-నంద‌మూరి దోస్తీ టూకాస్ట్‌లీ

Last Updated on by

ప్ర‌స్తుతం ఏ నోట విన్నా మెగా – నంద‌మూరి బాండింగ్ గురించే. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య స్నేహం గురించి అంతా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం కామ‌న్ జ‌నాలు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు మెగా-నంద‌మూరి అభిమానుల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ చాలా కాలంగా స్నేహితులు. ఇరుకుటుంబాల మ‌ధ్య చ‌క్క‌ని అనుబంధం ఉంది. ఆ క్ర‌మంలోనే ఆ ఇరువురి కుటుంబ ఫంక్ష‌న్ల‌లో రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు. ఒక‌రి సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఒక‌రు వెళుతున్నారు. కీల‌క‌మైన ఈవెంట్ల‌కు ఎటెండ‌వుతున్నారు. ఇక పుట్టిన‌రోజులు.. పెళ్లి రోజులు వ‌గైరా అయితే ఒక‌రి గురించి ఇంకొక‌రు టైమ్ స్పెండ్ చేస్తూ పార్టీలు ఇస్తున్నారు. ఈ స్నేహం ఇంత బ‌లంగా బ‌ల‌ప‌డ‌డం వెన‌క ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి.

ఎవ‌రు ఎలా విశ్లేషించినా చ‌ర‌ణ్-ఎన్టీఆర్ స్నేహ‌బంధం టాలీవుడ్‌కి మ‌రింత‌గా కలిసొచ్చేదేన‌న‌డంలో సందేహం లేదు. ఈ బాండింగ్ కేవ‌లం హీరోల మ‌ధ్య మాత్ర‌మే కాదు .. అభిమానుల మ‌ధ్య కూడా. ఇన్నాళ్లు మెగా అభిమానులు, నంద‌మూరి అభిమానులు అంటూ రెండుగా, వేర్వేరుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ఇరువ‌ర్గాలు ఏక‌మ‌య్యాయి. దీన‌ర్థం ఇన్నాళ్లు ఒక్క హీరో ఫేస్ వ్యాల్యూ 100-200కోట్లు అనుకుంటే.. ఇప్పుడు ఆ వ్యాల్యూ డ‌బుల్ అవుతోంది. అంటే ఆ ఇరువురు హీరోలు న‌టించే సినిమాలు 200కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం, అంత‌కుమించి బాక్సాఫీసులు బ‌ద్ధ‌ల‌వ్వ‌డం పెద్దంత క‌ష్టం కానేకాదు. మెగా-నంద‌మూరి అభిమానులు క‌లిసి సినిమాలు చూస్తే, థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం గ్యారెంటీ. అంటే ఏపీ, తెలంగాణ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగా-నంద‌మూరి ఫ్యాన్స్‌ ఎలాంటి డివైడ్ ఫ్యాక్ట‌ర్ లేకుండా ఇద్ద‌రి సినిమాల్ని ఆద‌రిస్తార‌నే ఈ స్నేహం చెబుతోంది. బిగ్‌ టైటాన్స్ క‌ల‌యిక వెన‌క ఉన్న వాస్త‌విక‌ బిజినెస్ కోణం ఇంత పెద్ద‌గా ఎలివేట్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే తార‌క్‌, చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌పై అంత‌కంత‌కు అంచ‌నాలు రెట్టింప‌వుతున్నాయి. ఈ ఆదివారం ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చ‌ర‌ణ్ చాలా ప్ర‌త్యేకంగా అత‌డికి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆ ఫోటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

User Comments