చిరంజీవి బ‌యోపిక్ లో మెగాప్రిన్స్

త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ జిగ‌ర్తాండ తెలుగులో వాల్మీకి పేరుతో రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 20న రిలీజ్ చేయ‌నున్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన వాల్మీకి ఇంట‌ర్వ్యూలో క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ కి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి బ‌యోపిక్ లో అవ‌కాశం వ‌స్తే న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు .. త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని అన్నారు. అయితే మొద‌టి ఆప్ష‌న్ మాత్రం అన్న రామ్ చ‌ర‌ణ్. ఆ త‌ర్వాత‌నే తాను న‌టించే వీలుంద‌ని వ‌రుణ్ తెలిపారు.
మాతృక జిగ‌ర్తాండ‌తో వాల్మీకి పోలిక ఉంటుందా? అన్న ప్ర‌శ్న‌కు.. “జిగ‌ర్తాండ` జాతీయ అవార్డు అందుకున్న సినిమా. అందులో బాబీ సింహా అద్భుతంగా న‌టించారు. అయితే త‌న‌లా చేయాల‌ని ఇమ్మిటేట్ చేయ‌లేదు. పూర్తిగా కొత్త‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నించాను. అలాగే ఆ పాత్ర‌లోని కొన్ని పాయింట్స్ తీసుకుని మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా నా పాత్ర చిత్ర‌ణ‌ను మార్చార‌“ని వ‌రుణ్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. జిగ‌ర్తాండ పాత్ర‌ను య‌థాత‌థంగా న‌టిస్తే బావుండ‌ద‌ని వాల్మీకి కోసం చాలా కొత్త‌గా ప్ర‌య‌త్నించాన‌ని అన్నారు. జిగర్తాండ క‌ల్ట్ క్లాసిక్. దానిని ట‌చ్ చేయ‌డం మంచిది కాదు. కానీ ప్ర‌య‌త్నించామ‌ని అన్నారు. జిగ‌ర్తాండ చిత్రాన్ని ఆల్రెడీ చూసిన ఆడియెన్ చూస్తారా? అంటే చూడాల్సిందేన‌ని వ‌రుణ్ అన్నారు. ఇప్ప‌టికే ఆ సినిమా చూసిన‌వాళ్ల‌కు వాల్మీకి న‌చ్చుతుంద‌ని అన్నారు. ఒక‌టి క‌ల్ట్ సినిమాని కెలికారు. హ‌రీష్ మార్క్ మాసిజాన్ని యాడ్ చేశారు. చిరంజీవి పునాది రాళ్లు రెట్రో లుక్ ని వ‌రుణ్ ట్రై చేశారు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కూ జ‌నాల‌కు క‌నెక్ట‌వుతుంది? అన్నది వేచి చూడాల్సిందే.