బావ కోసం మెగాప్రిన్స్‌ త్యాగం

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో తెరంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న సమాచారం ఇప్ప‌టికే ఉంది. అయితే వైష్ణ‌వ్ డెబ్యూ సినిమా కోసం మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ త‌న ద‌ర్శ‌కుడిని త్యాగం చేశాడంటూ ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. బావ కోసం వ‌రుణ్ త్యాగం అంటూ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

వాస్త‌వానికి వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేం సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ చిత్రానికి గోపి ఆచంట‌, రామ్ ఆచంట నిర్మాత‌లు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ వెన‌క్కి వెళ్లింది. ఆ క్ర‌మంలోనే వ‌రుణ్‌తేజ్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ త‌న వ‌రుణ్ స్క్రిప్టునే మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌కి వినిపించాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాని `చుట్టాల‌బ్బాయి` ఫేం రామ్ తాళ్లూరి నిర్మిస్తార‌ని తెలుస్తోంది. రామ్ తాళ్లూరి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి ఎంతో స‌న్నిహితుడు. అందువ‌ల్ల ఈ ప్రాజెక్టు ఖాయ‌మైన‌ట్టేనన్న మాటా వినిపిస్తోంది. ఇక‌పోతే వ‌రుణ్‌తేజ్ త‌న చిన్న బావ వైష్ణ‌వ్ తేజ్ కోసం త‌న ద‌ర్శ‌కుడిని వ‌దులుకున్న‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది.