మెగా ప్రిన్సెస్‌కి మెగాఫ్యాన్స్ దూరంగా?

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక హ్యాట్రిక్ ప్లాప్స్ కి కార‌ణ‌మేంటి? మెగాభిమానుల ఆద‌ర‌ణ క‌రువ‌వ్వ‌డం వ‌ల్ల‌నే ఈ ఫ్లాప్‌లు ఎదుర్కొందా? లేదూ అస‌లు సినిమాలో విష‌యం లేక‌పోవ‌డమే ఈ ప‌రాజ‌యాల‌కు కార‌ణ‌మా? ప‌్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ డిబేట్ ఇది. అందం ఉంది. ప్ర‌తిభ ఉంది. అయితేనేం.. అన్నీ ఫ్లాపులే. వీటిని నిహారిక రివ్యూ చేసుకుంటోందా .. లేదా?

న‌టించిన తొలి సినిమా ఒక‌మ‌న‌సు- ఆర్ట్ ఫిలిం, త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న చేసిన‌ సినిమా ఆ త‌ర‌హానే, ఇప్పుడు హ్యాపి వెడ్డింగ్ నేరేష‌న్ లోపాల‌తో ఫ్లాప్‌. మొత్తానికి హ్యాట్రిక్ ఫ్లాప్‌లు కొట్టింది. ఇక మెగాభిమానులు నిహారిక‌ను నెత్తిన పెట్టుకుని పూజిస్తారు అనుకుంటే వాళ్లే ఈ సినిమాలు చూడ‌లేదా? లేదూ మెగాద‌ర‌ణ ఉన్నా.. కామ‌న్ ఆడియెన్‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే కంటెంట్ సినిమాలో లోక‌పోవ‌డం వల్ల‌నే ఇలా అయ్యిందా? అంటూ చ‌ర్చ‌కు తావిచ్చింది. ఇక‌నైనా ఎంతో జాగ్ర‌త్త‌గా కెరీర్‌ని మ‌లుచుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్న వ‌రుణ్‌తేజ్ త‌ర‌హాలో వైవిధ్యం, గ‌ట్స్‌తో నీహా ఎద‌గాల‌ని కోరుకుంటున్నారు. జ‌స్ట్ వెయిట్ .. కాల‌మే కొన్నిటికి స‌మాధాన‌మిస్తుంది.