బ‌న్ని బావతో మెగా ప్రిన్సెస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.  చిత్తూరు ఎర్ర‌చంద‌నం స్మంగ్లిగ్ నేప‌థ్యంలో శేషాచ‌లం అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ చేయాల‌ని భావిస్తున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ సుక్కు టీమ్ తో జాయిన్ కానునున్నాడు. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత, ఆర్య కాంబినేష‌న్ రిపీట్  అవ్వ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. తాజాగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో మెగా డాట‌ర్ నిహారిక కూడా  భాగం కానుందిట‌.

ఇందులో నిహారిక ఓ కీ రోల్ పోషించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే మెగా డాట‌ర్ కి సుక్కు-బ‌న్నీ లిప్ట్ ఇచ్చిన వాళ్లు అవుతారు. ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల‌ని ఎన్నో క‌ల‌ల‌తో ఎంట్రీ ఇచ్చి మెగా బ్యూటీ ఆశించినంత‌ స‌క్సెస్ కాలేక‌పోయింది. త‌న లో మంచి న‌టి ఉన్నా నిరూపించుకునే స‌రైన వైబ్రెన్సీ  ఉన్న‌ పాత్ర‌లు కుద‌ర‌క‌పోవ‌డంతో రేసులో బాగా వెనుక‌బ‌డింది. ఉమెన్ సెంట్రిక్  చిత్రాల్లోనైనా నిల‌బ‌డాల‌నుకుంది. కానీ అదీ కుద‌ర‌లేదు. చివ‌రిగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డిలో గిరిజన‌ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. ఆ రోల్ చాలా చిన్న‌ది కావ‌డంతో ఎలివేట్ కాలేక‌పోయింది. మ‌రి ఇప్పుడు సుకుమార్ ఎలాంటి రోల్ ఆఫ‌ర్ చేసాడో చూడాలి.