మెగాస్టార్ 152 మ్యూజిక్ సిట్టింగ్స్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` బాక్సాఫీస్ రిజ‌ల్ట్ గురించి తెలిసిందే. హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచినా.. తెలుగు రాష్ట్రాల్లో బంప‌ర్ హిట్ కొట్టింది ఈ చిత్రం. ఇక మెగా బాస్ త‌దుప‌రి సినిమాపై సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు ప్రారంభించారు.  చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు ఇప్ప‌టికే పూర్త‌వుతున్నాయి. ప్ర‌స్తుతం మణి శర్మ- కొరటాల శివతో పాటు చిరు మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నార‌ట‌. అందుకోసం బ్యాంకాక్ వెళ్లార‌ని తెలుస్తోంది. అక్క‌డ ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

సోషియో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రం కాబ‌ట్టి ఈ చిత్రంలో చిరు డ్యాన్సుల‌కు ఆస్కారం ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే మాసీ బీట్స్ అవ‌స‌రం ఉంటుంది. మ‌ణిశ‌ర్మ దీనిని స‌వాల్ గా తీసుకున్నార‌ట‌. డిసెంబ‌ర్‌ లో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్. ఇది దేవాల‌య భూముల అవినీతి చుట్టూ తిరిగే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని చెబుతున్నారు. అయితే ఇందులో చిరు స‌ర‌స‌న నాయిక‌లు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది.