మేన‌ల్లుడికి చిరు హ్యాండు

Last Updated on by

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌పైనే క‌ళ్ల‌న్నీ! కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు సాయిధ‌ర‌మ్ కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేసినా అదంతా తాత్కాలిక‌మేన‌నేంత‌టి విజ‌యం సాధించేందుకు శ‌త‌ధా శ్ర‌మిస్తున్నాడు. ప్ర‌స్తుతం స‌క్సెస్ వెంట‌ప‌డే స్పెష‌ల్ వ‌ర‌ల్డ్‌లో అత‌డి పోరాటం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలో బ్యాక్ టు ద ట్రాక్ అన్న తీరుగానే సాయిధ‌ర‌మ్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడ‌న్న టాక్ ఉంది. ఫ్లాప్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి క‌రుణాక‌ర‌న్ సైతం ఈ సినిమాతో ట్రాక్‌లోకి వ‌చ్చేందుకు సీరియ‌స్‌గా ప్ర‌యత్నిస్తున్నాడుట‌. ఆ క్ర‌మంలోనే మెగా నిర్మాత కె.ఎస్‌.రామారావుతో క‌లిసి ఈ కాంబో అదిరిపోయే ల‌వ్‌స్టోరీని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే సాయిధ‌ర‌మ్ తిరిగి స‌క్సెస్ ట్రాక్‌లోకి రావ‌డం సులువేనా? అంటే.. ఈసారి మాత్రం ప్ర‌య‌త్నం సీరియ‌స్‌గానే ఉంటుంద‌ని స‌న్నివేశం చెబుతోంది. సాయిధ‌ర‌మ్‌ని స‌క్సెస్‌ ట్రాక్‌లోకి తెచ్చేందుకు ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి బ‌రిలో దిగుతున్నారు. ఆయ‌న‌కు మెగాహీరోలంద‌రిలో సాయిధ‌ర‌మ్ అంటే ప్ర‌త్యేక అభిమానం. ఎంత‌యినా మేన‌ల్లుడు.. ఆపై కెరీర్ సింకింగ్‌లో ఉంటే త‌ప్ప‌దు క‌దా! అయితే మెగాస్టార్ ఎప్పుడూ మేన‌ల్లుడిపై ఓ క‌న్నేసి ఉంచుతారు. ప్ర‌తిదాంట్లో ఇన్వాల్వ్ అయ్యి త‌ల‌బొప్పి క‌ట్టించే త‌ప్పు చేయ‌రంతే. గ‌త కొంత‌కాలంగా సాయిధ‌ర‌మ్ ట్రాక్ గ‌తి త‌ప్పుతున్న వైనం మెగాస్టార్ ప‌రిశీలించారు కాబ‌ట్టి, ఇక లాభం లేద‌నే బ‌రిలో దిగుతున్నారుట‌. ఆ క్ర‌మంలోనే `తేజ్ .. ఐ ల‌వ్ యు`కి మెగా కాంపౌండ్ భారీ ప్ర‌మోష‌న్ చేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించార‌ట‌. ముందుగా మెగాస్టార్ చిరంజీవి `తేజ్‌..` ఆడియో వేడుక‌కు విచ్చేస్తారు. `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్` ఆడియోకి విచ్చేసిన చిరు ఆ త‌ర‌వాత వేరే ఏ ఆడియోకి రాలేదు. ఇంత‌కాలానికి `తేజ్ ఐ ల‌వ్ యు` ఆడియోలో సంద‌డి చేయ‌నున్నారు. ఇక మీద‌ట వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా సాయిధ‌ర‌మ్‌కి మెగా హీరోల ప్ర‌మోష‌న్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈనెల 29న తేజ్ ఐ ల‌వ్ యు రిలీజవుతోంది. ఈనెల‌ 9న హైద‌రాబాద్ జెఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఆడియో రిలీజ్ కానుంది. మేన‌ల్లుడి కోసం..చిరు ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతుందేమో చూడాలి.

User Comments