మెగాస్టార్ కి హైకోర్టులో ఊర‌ట‌

Last Updated on by

Last updated on March 15th, 2019 at 03:37 pm

ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై దాఖ‌లైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2014 ఏప్రిల్ 27న రాత్రి ప‌ది గంట‌ల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసారంటూ గ‌తంలొ గుంటూరు అరండ‌ల్ పేట పోలీసుకు కేసు న‌మోదు చేసారు. దీనిపై దాఖ‌లైన‌ చార్జ్ షీట్ ను కింది కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ చిరంజీవి ఉమ్మ‌డి హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. బుధ‌వారం దీనిపై న్యాయమూర్తి జ‌స్టిస్ టి. ర‌జ‌నీ ముందు జ‌రిగింది. చిరంజీవి ప్ర‌చారం ముగించుకుని తిరిగి వ‌స్తుండగా అక్ర‌మంగా కేసు బ‌నాయించార‌ని ఆయ‌న త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. దీన్ని ప‌రిగ‌న‌లోకి తీసుకున్న న్యాయ‌మూర్తికేసును ర‌ద్దు చేస్తూ తీర్పు నిచ్చింది.

ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జారాజ్యం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ల‌ పాటు కొన‌సాగినా త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోలేదు. తెలంగాణ రాష్ర్టం అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో అదిష్టానం ప్రచార బ‌రిలో దించాల‌ని చూసినా ఆయ‌న ఆస‌క్తి చూపించక‌పోవ‌డంతో ఆ పార్టీకి కూడా దూరంగా ఉన్నార‌ని క్లారిటీ వ‌చ్చింది. అలాగ‌ని త‌మ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీఓ చేరారా? అంటే అదీ ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. ఏపీలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన చిరు ఇంకా మౌనంగానే ఉన్నారు. మ‌రి త‌మ్ముడు కోసం ప్ర‌చారం బ‌రిలో దిగుతారా? పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారా? అన్న దానికి స‌మాధానం దొర‌క‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Also Read: Keeravani’s Shocking Statement On  RRR

User Comments