రాజుగారి కాంపౌండ్ లో లై బ్యూటీ!

Last Updated on by

లై` బ్యూటీ మేఘా ఆకాష్ దిల్ రాజు కాంపౌండ్ లో అడుగు పెట్టిందా? అమ్మ‌డి థ‌ర్డ్ మూవీ రాజుగారి నిర్మాణంలోనే? అంటే అవున‌నే వినిపిస్తోంది. మేఘ ఆకాష్ న‌టించి `లై,` `ఛ‌ల్ మోమ‌న రంగ` ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో తెలిసిందే. దీంతో సొగ‌స‌రికి ఇక్క‌డ అవ‌కాశాలు రాలేదు. వెయిట్ చేసి లాభం లేద‌నుకున్న భామ కోలీవుడ్ కు వెళ్లిపోయింది. వెళుతూనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పేట` లో చిన్న రోల్ అందుకుంది. ప్ర‌స్తుత మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో `శాటిలైట్ శంక‌ర్` లోనూ న‌టిస్తోంది. తాజాగా భామ టాలీవుడ్ లో మ‌రో ఛాన్స్ అందుకుంద‌ని స‌మాచారం.

అదీ దిల్ రాజు కాంపౌండ్ లో అని వినిపిస్తోంది. యంగ్ హీరో రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా ఆడు మ‌గ‌డ్రా బుజ్జి ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి ఓచిత్రాన్ని తెరకెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసారు. వేస‌విలో రెగ్యుల‌ర్ షూటింగ్ వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఇందులోనే మేఘా ఆకాష్ కి ఛాన్స్ ఇచ్చిన‌ట్లు వినిపిస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని యూనిట్ అధికారికంగా వెల్ల‌డించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్ర‌స్తుతం దిల్ రాజు మ‌హ‌ర్షి సినిమాను మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

User Comments