మెగాస్టార్ 152 లాంచ్ డేట్

Chiranjeevi and Koratala - File Photo

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం ఈనెల 26 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్  కోకాపేటలోని చిరు ఫామ్ హౌస్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. దాదాపు 20 ఎక‌రాల్లో ఉన్న ఫామ్ లో ఇంత‌కుముందు సైరా న‌ర‌సింహారెడ్డికి సంబంధించిన భారీ కోట సెట్ వేసి సినిమాలో ప్ర‌ధాన భాగం చిత్రీక‌రించారు. ఇప్పుడు అక్క‌డే సెంటిమెంటుతో చిరు 152వ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

మొద‌టి షెడ్యూల్ ని హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోనే తెర‌కెక్కించి అటుపై రాజ‌మండ్రిలో రెండో షెడ్యూల్ ని ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌రించ‌నున్నారు. ఆ మేర‌కు కొర‌టాల టీమ్ లొకేష‌న్ల వేట సాగించింది. ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అజ‌య్  – అతుల్ ద్వ‌యం సంగీతం అందించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ చేయ‌నున్నారు.