మెగాస్టార్‌తో తేజ్ పోలిక అదే

సుప్రీమ్ హీరో సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతిరోజూ పండగే`. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. తాజాగా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ-“ సినిమాను థియేటర్ లో ఫామిలీ అందరితో పాటు చూస్తే వచ్చే ఆనందం వేరు. మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు, ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంజనాదేవి గారు మా ట్రైలర్ విడుదల చెయ్యడం సంతోషం. తేజ్ సినిమా చేస్తున్నప్పుడు ఇతర పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఈ లక్షణం తేజ్ లో ఉండడం విశేషం“ అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ-“చిత్రాలహరి సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుండి మీకు అన్ని మంచి సినిమాలే ఇస్తాను. మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం మా టీమ్, సో మా యూనిట్ సభ్యులకు థాంక్స్ తెలుపుతున్నాను. మారుతి గారు మాతో మంచి ఫీల్ గుడ్ సినిమా చేయించరు. గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్స్ లో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు

మారుతి మాట్లాడుతూ “ట్రైలర్ చూసి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ కు గీతా, యూవీ బ్యానర్స్ కు థాంక్స్. ఈ కథ ముందుగా దిల్ రాజుకు చెప్పినప్పుడు ఆయన సబ్జెక్ట్ బాగుందని ఎంకరేజ్ చేశారు. తేజ్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు. సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. సత్యరాజ్ గారు కథ విని ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజుకు ఈ సినిమాకు వర్క్ చేస్తాను అన్నారు. రావ్ రమేష్ గారి పాత్ర గుర్తుండి పోతుంది. తండ్రిగా, కొడుగ్గా వెరీయేషన్స్ ఉన్న పాత్రలో నటించారు “ అని తెలిపారు. బన్నీవాసు మాట్లాడుతూ -“ఈ కథను విని నమ్మి ఒప్పుకున్నందుకు ధన్వవాదాలు. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం“ అన్నారు.