ఫైర్ మెన్ శ్రీ క్రాంతికుమార్ ను అభినందించిన మెగాస్టార్

Last Updated on by

భారీ వర్షాలు సందర్భంగా ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి వెంటనే శ్రీ క్రాంతి కుమార్ ను అభినందించారు.
Fire Man క్రాంతి కుమార్ కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు శ్రీ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
శ్రీ క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ Station Fire Officer (SFO) శ్రీ జయరాజ్ కుమార్ ని
ప్రత్యేకంగా అభినందించారు.
అదే విధంగా రక్షింపబడ్డ 4సం,,ల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు.

User Comments