ఫిల్మ్ న్యూస్‌కాస్టర్స్‌కి మెగా చేయూత

టాలీవుడ్ లో ఎల‌క్ట్రానిక్ మీడియా.. వెబ్ జ‌ర్న‌లిస్టుల కోసం ఫిల్మ్ న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. సినీజ‌ర్న‌లిస్టుల‌కు మినిమం భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ ఈ అసోసియేష‌న్ దూసుకుపోతోంది. హెల్త్ కార్డులు.. ఇన్సూరెన్సులు స‌హా ప‌లు ర‌కాల సేవాకార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టిన సంగతి తెలిసిందే.

ఫిల్మ్ జర్నలిస్ట్ ల కోసం అసోసియేషన్ చేస్తున్న కార్యకమాలను మెచ్చుకొని మెగాస్టార్ చిరంజీవి తన వంతు గా మ‌ద్ధ‌తునిస్తూ అసోసియేష‌న్ కి ఆర్థిక‌ సహాయం చేశారు. భవిష్యత్తు లో సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటాని చిరు భ‌రోసా ఇచ్చారు. ఇప్ప‌టికే అసోసియేష‌న్ కి అగ్ర నిర్మాత దిల్ రాజు విరాళం అందించిన సంగ‌తి తెలిసిందే.