అన్న‌య్య‌ నిరాడంబ‌ర‌తపై ఇంకా చ‌ర్చ‌

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి సింప్లిసిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వెళ్లి పెద్ద స్టార్ అయిన వ్య‌క్తి. హంగులు . . ఆర్బాటాల‌కు దూరంగా ఉంటారు. పెద్ద స్టార్ అయినా నిడారంబ‌రంగా ఉంటారు. సింపుల్ గా ఉండ‌ట‌మే ఆయ‌న‌కు ఇష్టం . వ్య‌క్తిగ‌తంగాను క‌ల్మ‌షం లేని వ్య‌క్తిత్వం గ‌ల‌వారు. ఇక సామాజిక సేవ‌లు గురించి తెలిసిందే. ర‌క్త‌దానం, నేత్ర‌దానం వంటి కార్య‌క్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు. క‌ష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవ‌డంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఇక వృత్తి ప‌రంగా చిరు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా ఇటీవ‌ల చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న మ‌రోసారి మెగాస్టార్ నిడారంబ‌ర‌త‌ను చాటి చెప్పింది.

విప్లవ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి న‌టించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ అతిధిగా విచ్చేసారు. ఆయ‌న చేతులు ముదుగానే సీడీల‌ను లాంచ్ చేసి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేసారు. అయితే అంత‌కు ముందు చిరు ల్యాబ్ లోకి అడుగు పెట్ట‌గానే స్నాక్స్ తీసుకోండి సార్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి కోర‌గా త‌ప్ప‌కుండా అంటూ చిరుస్నాక్స్ తీసుకున్నారు. ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఏర్పాటు చేసిన జిలేబీ, ప‌కోడి అంద‌రితోపాటు తీసుకుని చిరు స్టేజ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

సాధార‌ణంగా పెద్ద హీరోలు ఎవ‌రూ సినిమా ఈవెంట్ల‌ల‌లో తిన‌డానికి ఇష్డ‌ప‌డ‌రు. సెక్యురిటీ ఇబ్బంది లేక‌పోయినా లెవ‌ల్ చూపిస్తారు. రావ‌డ‌మే నేరుగా య‌మా స్పీడ్ గా స్టేజ్ వ‌ద్ద‌కు వెళ్లిపోతారు. కానీ చిరు నెమ్మ‌దిగా న‌డుచుకుంటు అన్నింటిని ప‌రిశీలిస్తూ…స‌ర‌దాగా మాట్లాడుతూ వ‌చ్చారు. గ‌త ప‌దిహేన‌ళ్ల‌గా ఇలాంటి సంఘ‌ట‌న ఎప్పుడు ఆ ప్రాణంగాణంలో చోటు చేసుకోలేద‌ని ల్యాబ్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా చిరు నిడారంబ‌ర‌త‌ను కొనియాడారు.