టీజ‌ర్ టాక్: చ‌రిత్ర మ‌న‌తోనే మొద‌ల‌వ్వాలి వీరులారా

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయింది. కొద్ది సేప‌టి క్రిత‌మే యూనిట్ అధికారికంగా సోష‌ల్ మీడియాలోకి రిలీజ్ చేసింది. టీజ‌ర్ లోకి వెళ్తే..

చ‌రిత్ర స్మ‌రించుకుంటుంది. ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్, చంద్ర శేఖ‌ర్ ఆజాద్, భ‌గ‌త్ సింగ్ లాంటి ఎంద‌రో మ‌హ‌నీయులు ప్రాణ త్యాగాలు. కానీ ఆ చ‌రిత్ర పుట్ట‌ల్లో క‌నుమ‌రుగ‌య్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయుల‌పై తొలిసారి యుద్ధ భేరి మ్రోగించిన రేనాటి సూర్యుడు అంటూ టీజ‌ర్ పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్ తో మొద‌ల‌వుతుంది. హూ ఈజ్ దిస్ న‌ర‌సింహ‌రెడ్డి అని ఆంగ్లేయుడు అన‌గా..అత‌ని సామంతుడు సింహంలాంటోడు ..అత‌డే వాళ్ల ధైర్యం దొర అంటాడు. రేనాటి వీరులారా చ‌రిత్ర‌లో మ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు . కానీ చ‌రిత్ర ఈరోజు మ‌న‌తోనే మొద‌ల‌వ్వాలి అంటూ మెగాస్టార్ పలికే డైలాగులు ఆద్యంతం ఉత్కంఠ‌కు గురిచేస్తున్నాయి. టీజ‌ర్ లో వార్ స‌న్నివేశాల‌ను హైటైట్ చేసారు. గుర్రుపు స్వీరీలు…క‌త్తి యుద్దాల‌లో మెగాస్టార్ ఒదిగిపోయారు. అజ‌ర్ బైజాన్ లో షూట్ చేసిన క్లైమాక్స్ వార్ పీక్స్ లో కనిపిస్తోంది. విజువ‌ల్ గా టీజ‌ర్ గ్రాండియ‌ర్ గా ఉంది. అమిత్ త్రివేది ఆర్ ఆర్ క‌థ‌కు ప్రాణం పోసింది. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా పాత్ర‌లను టీజ‌ర్ లో పాక్షికంగా చూపించారు. ఈ చిత్రానికి సురెంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త‌వ్ం వ‌హించ‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పై 250 కోట్ల‌తో నిర్మిస్తున్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఆక్టోబ‌ర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.