మెగాస్టార్ డ‌బుల్ రోల్‌లో

Koratala siva and chiranjeevi (Image source : google)

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 152వ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌థానాయిక‌ల్ని ఫైన‌ల్ చేసే పనిలో కొర‌టాల బిజీ బిజీ. బాలీవుడ్ ట్యాలెంటెడ్ సంగీత ద‌ర్శ‌కద్వ‌యం అజ‌య్, అతుల్ ల‌తో కొర‌టాల సంప్ర‌దింపులు జ‌రిపార‌ని .. ఈసారి దేవీశ్రీ సంగీతం అందించ‌ర‌ని ప్ర‌చార‌మైంది. అలాగే త్రిష‌ను ఓ క‌థానాయిక‌గా ఎంపిక చేసార‌ని తెలుస్తోంది.

కొణిదెల వ‌ర్గాల ఇన్ఫో ప్ర‌కారం.. ఈ చిత్రంలో మెగాస్టార్ డ‌బుల్ రోల్ లో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. గోవింద అనే మాస్ రోల్ తో పాటుగా ఆచారి అనే క్లాస్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. మెగాస్టార్ డ‌బుల్ రోల్ అన‌గానే గోవిందుడు అంద‌రి వాడేలే.. రౌడీ అల్లుడు లాంటి ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక ఈ చిత్రం పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే స్క్రిప్టును కొర‌టాల సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ఈ డిసెంబ‌ర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈలోగానే రెండో క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేస్తార‌ట‌.