152 కోసం మెగాస్టార్ న్యూలుక్

Megastar Chiranjeevi's New Look Revealed

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల తెర‌కెక్కిస్తున్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఎలా ఉండ‌బోతోంది? అంటూ అభిమానులు స‌ర్వత్రా ఉత్కంఠ‌గా ఉన్నారు. ఇప్ప‌టికే చిరు లుక్ కి సంబంధించిన ర‌క‌రకాల ఫోటోల‌తో గెస్సింగ్ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంత‌లోనే మెగాస్టార్ లుక్ రివీలైంది. ఇదిగో ఇదే మోగా బాస్ లుక్! అంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో మెగాస్టార్ పూర్తి ట్రెండీగా క‌నిపిస్తున్నారు. మెగా బాస్ సింపుల్ గా వైట్ ష‌ర్ట్ లో క‌నిపిస్తున్నారు. ట్రిమ్ చేసిన గడ్డం మీసం.. ప‌క్క పాపిడి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఇక చిరు ఏజ్ 60 దాటినా.. ఇంకా 40లోనే ఉన్నారా? అన్నంత‌గా ఈ మేకోవ‌ర్ క‌నిపిస్తోంది. అయితే ఈ రూపం కోసం చిరు రెగ్యుల‌ర్ గా జిమ్ లో రెండున్న‌ర గంట‌లు అదే ప‌నిగా శ్ర‌మిస్తున్నార‌ని తెలుస్తోంది. సుశిక్షితుడైన కోచ్ స‌మ‌క్షంలోనే ఈ మేకోవ‌ర్ సాధ్య‌మైంది. లేటెస్టుగా ఓ విమానాశ్రయం నుంచి వ‌స్తూ బాస్ ఇలా కెమెరా కంటికి చిక్కారు. ఇక బ‌ర్నింగ్ పొలిటిక‌ల్ ఇష్యూస్ తో తెర‌కెక్కిస్తున్న మెగాస్టార్ 152 ఇంకా ప్రారంభం కాక‌ముందే అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 2022 ఎల‌క్ష‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ ఈసారి త‌న పొలిటిక‌ల్ కెరీర్ కి ఉప‌యుక్తంగా ఉండే క‌థాంశాన్ని ఎంచుకున్నార‌న్న టాపిక్ వేడెక్కిస్తోంది.