చిరు-ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్ హంబ‌క్కు?

Last Updated on by

సందెపొద్దు కాడ ల‌గ్గ‌మెట్టేత్తా మావో!.. సాయంత్రం గుడి ఎన‌కాల క‌లుసుకుందామా? అన్న‌ట్టే ఉంది వీళ్ల వ్య‌వ‌హారం. ఇదిగో ఏవండో రేపో మాపో ల‌గ్గ‌మెట్టేత్తున్నాం అని ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నంగా ఉన్నాయి కానీ, ఏదీ ఎక్క‌డ బాబూ ల‌గ్గం? అని ఫ్యాన్సే నీర్స‌ప‌డిపోతుండ్రు! ఇంత‌కీ ఏటి జ‌రిగినాదేటి?

మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాంబినేష‌న్ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించేందుకు ప‌లువురు నిర్మాత‌లు ఉవ్విళ్లూరుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాని ప్రారంభించేస్తున్నాం అంటూ టీఎస్సార్ ప్ర‌క‌టించి ఏడాది పైగానే అయ్యింది. అశ్వ‌నిద‌త్‌ని క‌లుపుకుని ఈ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాన‌ని, త్రివిక్ర‌మ్ క‌థ రెడీ చేస్తున్నార‌ని చెప్పారు పెద్దాయ‌న‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మావిడి తోట‌లో పెద్దాయ‌న అరిస్తే, అది బంజ‌రాహిల్స్‌లోని పార్క్‌హ‌య‌త్ హోట‌ల్‌కి వినిపించింది. కానీ ఏం లాభం? ఇంత‌వ‌ర‌కూ ముహూర్త‌మే లేదాయె! దాంతో ఇప్ప‌టికే అభిమానుల్లో నీర‌సం వ‌చ్చేసింది. మెగాభిమానులు అయితే టీఎస్సార్‌ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేస్తున్నారు. ఇలాంటి వేళ అల్లుడుగారు చేయ‌లేనిది మామ‌గారు చేస్తారులే అన్న‌ట్టు మెగాస్టార్‌-ప‌వ‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్ తీస్తాన‌ని గీతాఆర్ట్స్ అధినేత‌ అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించ‌డం వెట‌కారంగా ఉంది. తేజ్ ప్ర‌మోష‌న్స్‌లో నేను తీస్తానంటూ ప్ర‌క‌టించారు ఆయ‌న‌. అయినా.. ఏం ఉప‌యోగం? ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం… ప‌నులు శూన్యం! అన్న‌ట్టుగానే ఉంది వీళ్ల వ్య‌వ‌హారం. ఇక‌పోతే చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్లాక ఆయ‌న్ని వెన‌క్కి తేలేర‌ని అనుకుంటే, ఆయ‌నే వ‌చ్చారు. ఖైదీనంబ‌ర్ 150తో బంప‌ర్ హిట్ కొట్టి, సైరా-న‌ర‌సింహారెడ్డి లాంటి ఇండ‌స్ట్రీ బీస్ట్ సినిమాలో న‌టిస్తున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతారు కాబ‌ట్టి అప్పుడు ఎలానూ వెన‌క్కి తేలేరు. ఇక‌పోతే ప‌వ్ ఇప్పుడు ఓ రియ‌ల్ ఛాలెంజ‌ర్. ఏపీ రాజ‌కీయాల్ని అటో ఇటో తేల్చే ప‌నిలో ఉన్నారు. ఇలాంటి వేళ ఆయ‌న వెన‌క్కి వ‌స్తారా? తేగ‌ల‌రా? అన్న‌ది సందేహ‌మే. రాజ‌కీయాల్లోకి వెళ్లాక రావ‌ణ‌కాష్టంలో అడుగుపెట్టాక వెన‌క్కి తేగ‌ల‌రా? అన్న రాగ‌లిగినా, త‌మ్ముడు వ‌స్తాడంటారా? ర‌క్క‌స రాజ్యంలో రావ‌ణుల వేట‌లో అల‌సిసొల‌సి వెన‌క్కి రాగ‌ల‌రా?
రౌడీయిజంలోకి, రాజ‌కీయంలోకి ఒక్క‌సారి వెళితే తిరిగి రారు.. రాలేరు.. అక్క‌డ ఓడితే త‌ప్ప‌.. ఇదే అక్ష‌ర‌ స‌త్యం!!

User Comments